హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల | Hyderabad Cricket Association Elections Notification Released | Sakshi
Sakshi News home page

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వివరాలు

Sep 30 2023 8:42 PM | Updated on Sep 30 2023 9:02 PM

Hyderabad Cricket Association Elections Notification Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. 

ఆరోజే ఫలితాలు
ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓట‌ర్ల జాబితాను కూడా విడుద‌ల చేశారు. వ‌చ్చే నెల 4 నుంచి 7వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌ల అధికారి వి.సంప‌త్ కుమార్ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. అక్టోబరు 14న నామినేష‌న్ల‌ను స్క్రూటినీ చేయ‌నున్నారు. ఇక నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. 

మోగిన ఎన్నికల నగారా
కాగా వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్‌ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్‌సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది.

చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్‌ ఛేంజర్‌ తనే: యువరాజ్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement