
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు ట్రిబ్యునళ్లలో ఖాళీలపై(పెండింగ్ నియామకాలు చేపట్టకపోవడంపై) సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని వివరణ కోరింది.
బుధవారం ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని తేలికగా తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు నియమకాలపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది బెంచ్.
‘‘ఇది ట్రిబ్యునల్స్‌కు సంబంధించిన అంశం. రోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాం. అయినా ఏదో మొక్కుబడిగా నియామకాలు చేపడుతున్నారు. ఎంతో మంది రిటైర్ అవుతున్నారు. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బదులుగా ఏజీ స్పందిస్తూ.. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. దీంతో తదుపరి వాదనలను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment