vacancies
-
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్‌లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్‌మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపట్టింది. ఇటీవల ల్యాబ్ టెక్నీíÙయన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. బుధవారం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న అభ్యర్థులు.. అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. స్టాఫ్‌నర్స్ పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. మరిన్ని వివరాలకు తమ వెబ్సైట్ ( https://mhsrb.telangana.gov.in) ను సందర్శించాలని ఆయన కోరారు. ఇదీ సిలబస్.. అనాటమీ, ఫిజియాలజీలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎనీ్వరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాల జికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్టె్మంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ స్టాఫ్‌నర్స్ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్ల అభ్యర్థులకు 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు.. జోన్–2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. » అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. » ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. » దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. » ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు. » నవంబర్ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది. » హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. -
గెయిల్లొ 391 ఉద్యోగాలు (ఫోటోలు)
-
మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచి్చనట్టు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలు కలిపి 30 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటని, అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ అండ్ సివిల్‌డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో పాల్గొన్న 483 మంది ఫైర్ మెన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అగి్నమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో కలిసి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన వారికి ట్రోఫీలను, అదేవిధంగా అగి్నమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్లుగా నియమితులైన 157 మందికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి నియామక పత్రాలను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. జాబ్ కేలండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ ‘ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం. ఇప్పటికే ఇచి్చన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీకానున్న పోస్టులు కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసినట్టవుతుంది.రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ కేలండర్ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రులు, అధికారుల దృష్టికి తెండి. నిరసనలు తెలపాల్సిన పనిలేదు.. ఆందోళన చెందాల్సిన పని అంతకంటే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు. సహేతుకమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా ఎప్పుడూ నిబద్ధతతో పని చేస్తా..’అని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది.. ‘ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని రాష్ట్ర ప్రభుత్వం. యజమాని ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు. గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితి తెచి్చంది. పదవీ విరమణ పొందిన వారికి పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక నిబద్ధతను పాటించి.. ప్రతి నెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఫించన్ అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా గురువారం నాటి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు, ఉపాధికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రైతులకు సహాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం..’అని సీఎం తెలిపారు. ఇది ఉద్యోగం కాదు..సమాజ సేవ ‘కఠినమైన ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి సేవలందించేందుకు 483 మంది ముందుకు వచి్చనందుకు సంతోషంగా ఉంది. ఫైర్ సిబ్బంది అంటే కేవలం జీత భత్యాల కోసమే పని చేసేవారు కాదు. వరదలు ఇతర ఏ విపత్తు వచ్చినా ప్రాణాలు త్యాగం చేసైనా ప్రజలను కాపాడతామన్న సామాజిక బాధ్యత తీసుకోవడం..’అని రేవంత్ అన్నారు.యువకులను సుశిక్షితులుగా మార్చిన తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగులను సీఎం అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అగ్నిమాప శాఖ డైరెక్టర్ జీవీ నారాయణరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ నియామకాల్లో ‘మూడు ముక్కలాట’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఖాళీల భర్తీ వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది. సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థనే సొంతంగా నియామకాలు చేపడుతూ వస్తోంది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారానికి కోత పెడుతూ.. సొంతంగా భర్తీ చేసుకునే వీలు లేకుండా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత చూస్తున్న టీఎస్పీఎస్సీకి ఆ బాధ్యత అప్పగించింది. డ్రైవర్‌లాంటి పోస్టుల భర్తీ బాధ్యత తమకు వద్దంటూ ఆ సంస్థ పేర్కొనటంతో పోలీసు రిక్రూట్‌బోర్డుకు అటాచ్ చేసింది. డ్రైవర్లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు లాంటి పోస్టుల నియామక బాధ్యతను దానికి అప్పగించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాల బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ నియామక విభాగానికి అప్పగించారు. దీంతో ఈ మూడు సంస్థలు ఆర్టీసీలో ఖాళీల భర్తీని చూడనున్నాయి. ఫలితంగా పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో ఆర్టీసీకే తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జాబ్ కేలండర్ ఆధారంగానే... ఒకే అభ్యర్థి ఏక కాలంలో రెండుమూడు ఉద్యోగాల కోసం యత్నించటం సహజం. దీంతో అర్హత ఉన్న అన్ని ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఆయా పరీక్షలన్నింటికీ వారు హాజరు కావాలంటే వాటి నిర్వహణ తేదీలు వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలుంటే, ఏదో ఒక పరీక్షను మిస్ చేసుకోవాల్సిందే. దీంతో ఆయా సంస్థలు సమన్వయం చేసుకుని వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాయి. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇది సాగుతుంది. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీకేమో ఖాళీల భర్తీ అత్యవసరం. కానీ, భర్తీ ప్రక్రియ చూసే మూడు సంస్థలు ప్రత్యేకంగా ఆర్టీసీ కోసం ఏర్పాట్లు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణకు రూపొందించే షెడ్యూల్ ఆధారంగానే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం వ చ్చిన తర్వాత కొత్త నియామకాల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరి సారిగా ఆర్టీసీలో ఖాళీల భర్తీ జరిగింది. తెలంగాణ రాష్ర్‌్టరం ఏర్పడ్డ తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు. ప్రతినెలా పదవీ విరమణలు కొనసాగుతుండటంతో క్రమంగా సిబ్బంది సంఖ్య తగ్గిపోతూ బస్సుల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. ఓ దశలో మూడు వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. 2019లో ప్రభుత్వం ఆదేశించిందంటూ ఏకంగా 2 వేల బస్సులను ఆర్టీసీ తగ్గించుకుంది. అలా కొంత సమస్యను అధిగమించింది. ఆ తర్వాత మళ్లీ కొత్త బస్సులు అవసరమంటూ అద్దె బస్సుల సంఖ్యను ఒక్కసారిగా పెంచింది. అద్దె బస్సుల్లో వాటి యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతులతో ఎలాగోలా నెట్టుకొస్తూ వస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 1200 డ్రైవర్ల కొరత ఉంది. ఫలితంగా ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర కూడా చాలని స్థితిలో వారు డ్రైవింగ్ విధుల్లో ఉంటున్నారు. ఇది బస్సు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమిస్తోందని కారి్మక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కనీసం డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలంటూ.. డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందనీ వెంటనే ఖాళీల భర్తీని చేపట్టాలంటూ తాజాగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆర్టీసీ అభ్యరి్థంచింది. పలుదఫాలు కోరిన మీదట ఆగస్టులో చూద్దామని ఆ బోర్డు పేర్కొన్నట్టు సమాచారం. -
వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చి0ది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 34 డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2,400 దరఖాస్తులుప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది. బుధవారం నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌పై బ్యాన్ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. -
ఆర్టీసీలో 3,035 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వివిధ స్థాయిల్లో 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది. కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు. సాలీనా రూ.15 కోట్ల వ్యయం కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందే అదనపు డ్యూటీల భారం ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్‌లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది. డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్‌మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యరి్థస్తూ వచ్చారు. జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది. టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం – త్వరలో 3,035 పోస్టుల భర్తీ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
ఏడాదిలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభు త్వ శాఖల్లో వచ్చే ఏడాదికాలంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పోలీసుశాఖలో త్వరలో 15 వేల ఉద్యోగ నియామకాలకు చర్య లు చేపడతామని, పోలీసు నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనితోపాటు వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 5వేల ఉద్యోగాలకు కూడా ప్రకటనలు ఇస్తామని.. తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు అర్హత పొందిన 6,956 మందికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్‌తో ఉద్యోగాలు.. నిరుద్యోగుల కలల సాకారమే తెలంగాణ రాష్ట్రమని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లపాటు నిరుద్యోగులు దగాపడ్డారని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్‌లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టడంతో రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేశాం..’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తాము ప్రమాణ స్వీకారం చేసినది ఎల్బీ స్టేడియంలోనేని.. ఆ కార్యక్రమంతో తమ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారని రేవంత్ చెప్పారు. ఇప్పుడు నర్సులుగా ఎంపికైనవారి కుటుంబాల్లో అలాంటి సంతోషాన్ని చూసేందుకే ఇక్కడ నియామకపత్రాల పంపిణీ చేపట్టామన్నారు. రోజుకు 16గంటలకుపైగా పనిచేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టామని, కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు, భర్తీ ప్రక్రియపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. మంత్రులు రోజుకు సగటున 16 నుంచి 18 గంటలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నారన్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని, వాటికి తాము వెరవబోమని వ్యాఖ్యానించారు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన వారి కళ్లలో ఆనందాన్ని చూసి ఫాంహౌజ్‌లోని వారు కుళ్లుకుంటారని విమర్శించారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు ప్రజాప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని.. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కేసీఆర్ వెంటనే హరీశ్‌రావుకు గడ్డిపెట్టి నోరు మూయిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 6,956 మందికి స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకుంటున్నాం: భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఇంత పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ గొప్ప విషయమన్నారు. ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిందని.. దీనిని గాడిన పెట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని చెప్పారు. పైసా పైసా పోగు చేస్తూ పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: రాజనర్సింహ కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల్లో 88శాతం మహిళలు ఉండటం ఆనందంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్య విభాగానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి విద్య, వైద్యం, సంక్షేమం ఎంతో కీలకమని.. తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వేగంగా స్టాఫ్ నర్సు నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందరు డాక్టర్లు వచ్చినా రోగికి దగ్గరగా ఉండి సేవలు అందించేది నర్సులేనని చెప్పారు. -
‘గవర్నర్’ కోటాపై మెలిక !
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీటముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్‌కుమార్, కె.సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫారసులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తొలుత కేసు విచారణార్హతను తేల్చాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మరొకరి పేరును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. -
ఐదు వైద్య కళాశాలల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐదు వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేలా చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఐదు వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ బోధనా సి బ్బందిని కాంట్రాక్టు విధానంలో నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు వేతనాలు ఇవ్వడం, అదేవిధంగా శాశ్వత బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించేందుకు సాధ్యా సా«ద్యాలను పరిశీలించాల న్నారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్ప డం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ఐదు కళాశాలలను ప్రారంభించామని, ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, వైద్య విద్యార్థుల హాజరు ఉండేలా పర్య వేక్షించాలని సూచించారు. వైజాగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో ఇప్పటి వరకు 53వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కా ర్యదర్శి డాక్టర్ మంజుల, సెకండరీ హెల్త్ డైరెక్టర్, వై ఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ వెంకటేశ్వర్, డీ ఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల కొలువుల పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) నిర్వహించిన అర్హత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. 6,52,413 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 4,93,727 మంది హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైంది. గురుకుల బోర్డు ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు గురుకుల బోర్డు నిర్వహించినవన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే కావడంతో మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే వీలుంటుంది. ముందుగా అభ్యర్థుల జవాబు పత్రాల నకళ్లు, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ ఖరారు చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగ కేటగిరీలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, కీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. వీటికి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో వెబ్సైట్లో పెట్టలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించాలని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది కీలు తయారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది కీ విడుదల చేసిన రోజునే అభ్యర్థులు సంబంధిత పరీక్షల్లో సాధించిన మార్కులు సైతం విడుదలవుతాయి. గురుకుల విద్యా సంస్థల్లో టాప్ పోస్టులుగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు డెమో పరీక్షలుంటాయి. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్‌కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్‌కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే. కాగా ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్ ఆర్డర్)విధానాన్ని అమలు చేయాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. తొమ్మిది కేటగిరీల్లో కొలువులు... ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్ (డీఎల్), జూనియర్ లెక్చరర్(జేఎల్), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులున్నాయి. కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్‌కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్‌తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవరోహణ పద్ధతి ఇలా.. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా గురుకుల నియామకాల బోర్డు పరిధిలో 9 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్‌ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఉద్యోగ నియామకాలకు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హత పరీక్షల నిర్వహణ తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ వెల్లడించింది. నోటిఫికేషన్లో ప్రకటించిన తేదీలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించనున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశుసంవర్థక శాఖ పరిధిలో 185 వీఏఎస్(వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్), ఉద్యాన వన శాఖ పరిధిలో 22 హెచ్ఓ పోస్టులు, రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు ఈనెల మార్చి, వచ్చే నెల ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. వీఏఎస్ ఉద్యోగాలకు రెండ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుండగా.. హెచ్ఓ, ఏఎంవీఐ పోస్టులకు ఒక రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
AP: జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. వెబ్సైట్లలో దరఖాస్తులు.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–135, కాపీయిస్టు–20, టైపిస్ట్–16, అసిస్టెంట్–14, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13, ఎగ్జామినర్–13, కంప్యూటర్ ఆపరేటర్లు–11, సెక్షన్ ఆఫీసర్లు–9, డ్రైవర్లు–8, ఓవర్సీర్–1, అసిస్టెంట్ ఓవర్సీర్–1 మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–1,520, జూనియర్ అసిస్టెంట్–681, ప్రాసెస్ సర్వర్–439, కాపీయిస్టు–209, టైపిస్ట్–170, ఫీల్డ్ అసిస్టెంట్–158, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114, ఎగ్జామినర్–112, డ్రైవర్(ఎల్వీ)–20, రికార్డ్ అసిస్టెంట్–9 మొత్తం 3,432 పోస్టులు. -
పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్ లిస్ట్)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు. -
మరో 2,440 సర్కారీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ విద్య, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యలో.. అరబిక్–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్ (మల్టీమీడియం)–1, కామర్స్–50, కామర్స్ (ఉర్దూ)–7, ఎకనామిక్స్–81, ఎకనామిక్స్ (ఉర్దూ)–15, ఇంగ్లిష్–153, ఫ్రెంచ్–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్–17, హిస్టరీ/సివిక్స్ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్ (మల్టీమీడియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతికశాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలుగు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యలో 359 పోస్టులు.. సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్–4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్–15, బయోమెడికల్ ఇంజనీరింగ్–3, కెమికల్ ఇంజనీరింగ్–1, కెమిస్ట్రీ–8, సివిల్ ఇంజనీరింగ్–82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్–41, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–1, ఫుట్‌వేర్ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్ ప్రెస్–5, మెకానికల్ ఇంజనీరింగ్ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్–5, ట్యానరీ–3, టెక్స్టైల్ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్ ఇన్స్ట్రక్టర్–14, లైబ్రేరియన్–31, మ్యాట్రన్–5, ఫిజికల్ డైరెక్టర్–37, ఎలక్టీష్రియన్–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. ఉన్నత విద్యలో.. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్ విభాగంలో ఇంగ్లిష్–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్డ్ న్యూట్రిషియన్–5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–39, కామర్స్–బిజినెస్ అనలటిక్స్(స్పెషలైజేషన్)–8, డెయిరీ సైన్స్–8, క్రాప్ ప్రొడక్షన్–4, డేటా సైన్స్–12, ఫిషరీస్–3, కామర్స్–ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్ గెజిటర్స్ విభాగంలో 6 రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్–24, ఫిజికల్ డైరెక్టర్–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్కివ్స్‌లో 8 పోస్టులు.. డైరెక్టర్ స్టేట్ ఆర్కివ్స్ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–1, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్(ఉర్వూ, పర్షియన్)–1, రిసెర్చ్ అసిస్టెంట్–1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఉర్దూ, పర్షియన్)–1 పోస్టులున్నాయి. -
Adilabad District: ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
ఇచ్చోడ(బోథ్): అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలో ఆదిలాబాద్ మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి రైతులకు ఆధునిక వ్యవసాయం, పంటల మార్పిడి, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగులో మెలకువలు, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. డీఏవో కూడా ఇన్చార్జీనే.. ఆదిలాబాద్‌లో పనిచేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లాకు వెళ్లింది. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ డీఏవోను నియమించలేదు. దీంతో ఆదిలాబాద్ ఏడీఏ, మార్క్‌ఫెడ్ డీఎంగా అదనపు బాధ్యతలు చూస్తున్న పుల్లయ్యను ఇన్చార్జి డీఏవోగా నియమించారు. కొత్త మండలాలకు మంజూరు కాని పోస్టులు ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సిరికొండ, గాదిగూడ, భీంపూర్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలను నియమించిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించడం మరిచింది. దీంతో ఆరు మండలాలకు ఆరేళ్లుగా ఇన్చార్జి వ్యవసాయ అధికారులే కొనసాగుతున్నారు. 18 మండలాలకు 11 మందే ఏవోలు జిల్లాలోని 18 మండలాల్లో కేవలం 11 మంది ఏవోలే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగితా ఏడు మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని బేల, ఇంద్రవెల్లి, తలమడుగు, సిరికొండ, భీంపూర్, మావల, గాదిగూడ మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. బేల మండల ఏవోగా పనిచేసిన రమేశ్‌ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయగా, ఏడాది కాలంగా బోథ్ ఏవో విశ్వామిత్ర బేల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. తలమడుగు ఏవో రమణను సర్వీసు నుంచి తొలగించడంతో నార్నూర్–2 ఏవో మహేందర్ తలమడుగు ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి ఏవో కైలాస్ నాలుగేళ్ల కిత్రం ఇచ్చోడకు బదిలీపై రావడంతో ఉట్నూర్ ఏవో గణేశ్ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన గాదిగూడకు టెక్నికల్ ఏవో జాడి దివ్య, సిరికొండకు ఇచ్చోడ ఏవో కైలాస్, భీంపూర్కు తాంసి ఏవో రవీందర్, మావలకు ఆదిలాబాద్ అర్బన్ ఏవో రవీందర్ ఇన్చార్జి ఏవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నార్నూర్, జైనథ్ మండలాలకు ఇద్దరు ఏవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. (క్లిక్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?) ప్రభుత్వానికి నివేదించాం కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం ఏవోలను నియమించలేదు. దీంతో పాత మండలాల ఏవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొన్ని మండలాల్లో ఏవోలు బదిలీపై వెళ్లడంతో అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – పుల్లయ్య, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
Tribunals Vacancies: కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు ట్రిబ్యునళ్లలో ఖాళీలపై(పెండింగ్ నియామకాలు చేపట్టకపోవడంపై) సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని వివరణ కోరింది. బుధవారం ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని తేలికగా తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు నియమకాలపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది బెంచ్. ‘‘ఇది ట్రిబ్యునల్స్‌కు సంబంధించిన అంశం. రోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాం. అయినా ఏదో మొక్కుబడిగా నియామకాలు చేపడుతున్నారు. ఎంతో మంది రిటైర్ అవుతున్నారు. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బదులుగా ఏజీ స్పందిస్తూ.. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. దీంతో తదుపరి వాదనలను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
సెబీలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు.. త్వరపడండి!
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120 ► పోస్టుల వివరాలు: జనరల్–80, లీగల్–16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)–14, రీసెర్చ్–07, అఫీషియల్ లాంగ్వేజ్–03. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022 ► వెబ్సైట్: sebi.gov.in -
డీఎస్ఎస్ఎస్బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. జూనియర్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 69 ► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)–116, జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్)–575. ► జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్): అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి 34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్): అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్1, టైర్2) ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2022 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022 ► వెబ్సైట్: dsssbonline.nic.in -
GHMC: హవ్వ.. ఇదేం పాలన?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని కోటిమందికి వివిధ రకాల సేవలందించాల్సిన బల్దియాలో ఉన్నతాధికారుల నిష్క్రియాపరత్వంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ల నుంచి వివిధ అంశాల్లో పట్టింపు లేకపోవడంతో కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. డిప్యుటేషన్లు ముగిసినా బల్దియా నుంచి వెళ్లని వారితోపాటు.. ఎవరు ఎక్కడ ఏంచేసినా చెల్లుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. బాధ్యతల వికేంద్రీకరణ పేరిట జోన్ల అధికారులకు పూర్తిస్థాయి అధికారాలివ్వడంతో అధికార వికేంద్రీకరణ బదులు అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో మహిళలను వేధించేవారి ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. జాయింట్ కమిషనర్ల పోస్టుల పేరిట కొందరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు. అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా మాతృశాఖకు వెళ్లకుండా.. పొడిగింపును కమిషనర్ అడ్డుకున్నా.. మరోమార్గంలో తిష్టవేసేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. ఇలా.. చెబుతూపోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. కదలరు.. వదలరు.. ► ఇటీవల ఒకరి డిప్యుటేషన్ అయిదేళ్ల కాలం ముగిసిపోయింది. తిరిగి పొడిగింపునకు ప్రయత్నించారు. కమిషనర్ నిక్కచ్చిగానే ససేమిరా కాదన్నారు. కానీ.. మరో మార్గంలో జీహెచ్ఎంసీలోనే మరో విభాగం నుంచి సదరు అధికారి డిప్యుటేషన్ కోసం ఒక అడిషనల్ కమిషనర్, విభాగాధిపతి, మరికొందరు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారంటే ఏమనుకోవాలి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. సదరు పోస్టులో మరొకరిని అప్పటికే ప్రభుత్వం నియమించడంతో ఆ అంకానికి తాత్కాలికంగా తెరపడినా.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ► మరో విభాగంలోని ఓ అధికారి అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. పై పెచ్చు పొడిగింపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేవలం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఫైల్ కదలదు. వీరు కదలరు. అయినా పట్టించుకున్నవారే లేరు. సారు.. చాలా బిజీ.. ► ఇక దోమల విభాగం తీరే ప్రత్యేకం. ఫాగింగ్ మెషిన్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మస్కూట్స్ పేరిట జరుగుతున్న దోపిడీకి అంతేలేకుండాపోయింది. ఈ విభాగంలో ‘కలెక్షన్’ చేసి పెట్టేవారికి రెండు జోన్ల బాధ్యతలు అప్పగిస్తుంటారనేది అంతా తెలిసిన విషయమే. ► ఇక జోనల్స్థాయిలోని అధికారులు జోన్లను తమ రాజ్యాలుగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే.. వారు ఎవరికీ ఫోన్లు ఎత్తరు. ‘సారు చాలా బిజీ’ అనే అర్థంలో స్వీయ సందేశంతో ఆటోమేటిక్ మెసేజ్‌లు మాత్రం వెళ్తాయి. ► ఇక వీరి పర్యవేక్షణలో పనిచేసే వారు సైతం తామూ తక్కువేమీ తీసిపోలేదన్నట్లు..డిప్యూటీ కమిషనర్లయినా, వైద్యాధికారులైనా, ఇంజినీర్లయినా, మరొకరయినా సరే జోన్లు, సర్కిళ్లలో ఉండరు. ప్రజలెవరైనా తమ సమస్యల కోసం అక్కడకు వెళ్తే సీట్లలో ఉండరు. ఫీల్డ్ అంటారు. లేకుంటే హెడ్డాఫీసుకు వెళ్లారంటారు. కానీ ఎక్కడా ఉండరు. మరి ఎక్కడుంటారో తెలియదు. జోనల్ పెద్దసారుకు అనుకూలంగా ఉంటే చాలు.. ఎక్కడున్నా పనిచేసినట్లే. గదిలో కునుకు తీస్తున్నా బాగా పనిచేసినట్లే లెక్క. పైవారితో ‘లెక్క’ సరిగ్గా ఉంటే అంతా భేషే! ► వికేంద్రీకరణ పేరిట అధికారాలతోపాటు జీతాలు, బిల్లుల చెల్లింపులు, తదితరమైనవన్నీ జోన్లలోనే జరుగుతున్నాయి. పనుల తనిఖీలు, పర్యవేక్షణలు చేసే పెద్దసారుతో సవ్యంగా ఉంటే చాలు. ప్రధాన కార్యాలయం అలంకార ప్రాయం. బల్దియా బాస్ నామ్‌కే వాస్తే అన్న అభిప్రాయం బలంగా నెలకొంది. గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు.. ► కొంతకాలం క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ మహిళలతో కలిసిన ఫొటోలు వైరల్ కావడంతో అతడికి స్థానచలనం కలిగించారు. డిప్యూటీ కమిషనర్ కాస్తా జాయింట్ కమిషనర్‌గా మారారు. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్.. మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న విషయం తెలిసినా.. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. పైగా తప్పుచేసిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మేయర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే కానీ విషయం బయటకు రాలేదు. ఏళ్లకేళ్లుగా పొడిగింపు.. ► బల్దియాలోకి ఒకసారి వస్తే.. పాతుకుపోతారనే ప్రచారం ఉంది. లక్ష డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు అవసరమని దాదాపు 250 మంది ఇంజినీర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనుల కోసం మళ్లీ అంతమంది పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో చాలామంది బల్దియాలోని వారికి ఏదో రకంగా దగ్గరివారే. అందుకే పని చేయకున్నా, పని లేకున్నా జీతం వస్తోంది. అలా ఏళ్లకేళ్లు పొడిగింపునిస్తుంటారు. ► కమిషనర్ స్వీయనిర్ణయాలు తీసుకోక, బల్దియాలో పాత కాపులైన ఒకరిద్దరు అధికారులు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సచివాలయం స్థాయిలోని ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులకు వారు దగ్గరవడమే కారణమని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.