AIIMS, IMMT Bhubaneswar Recruitment 2021: Apply Online Jobs, Vacancies - Sakshi
Sakshi News home page

ఎయిమ్స్, భువనేశ్వర్‌లో 90 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

Published Tue, May 25 2021 5:03 PM | Last Updated on Tue, May 25 2021 5:25 PM

AIIMS, IMMT Bhubaneswar Recruitment 2021: Apply Online Jobs, Vacancies - Sakshi

భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 90
విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: సూచించిన పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ లేదా కేవలం పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021
► వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in



ఐఎంఎంటీ, భువనేశ్వర్‌లో  14 ఖాళీలు

భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌–ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 14

పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జి)–07, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌–అకౌంట్స్‌)–02, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌–పీ)–03, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌–02.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జి): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌–అకౌంట్స్‌): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌–పీ): వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు.

జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500–81,100 చెల్లిస్తారు.

అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ(ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు) ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021
► వెబ్‌సైట్‌: http://www.immt.res.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement