All India Institute of Medical Sciences
-
పిల్లలకు థర్డ్‌వేవ్ ఎక్కువ ప్రమాదకరం.. వైద్యులేమంటున్నారంటే..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందనుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మళ్లీ దాడి మొదలైంది. గత కొన్ని రోజులుగా కనీవినీ ఎరుగని స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదు. ఈ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ ప్రభావితులు అవుతారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం! కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ 10కంటే ఎక్కువ రేట్లతో వచ్చే ఒమిక్రాన్ పిల్లలలో కనిపించే అత్యంత అంటు వ్యాధి అని ఎయిమ్స్ వైద్యుడు రాకేష్ లోధా తెలిపారు. మొదటి రెండు వేవ్‌లలో పిల్లల జోలికి ఎక్కువ రాకపోయినా ఒమిక్రాన్ ద్వారా వచ్చే యూడో వేవ్‌లో మాత్రం చాలా మంది చిన్నారులు, నెలల పిల్లలు కూడా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయన్నారు. అయితే అందులో చాలా మందికి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రాగా.. మరి కొంత మందికి స్వల్ప లక్షణాలు కనిపించాయి. చదవండి: చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ పిల్లలపై కోవిడ్ ప్రభావంపై ఎయిమ్స్ నిర్వహించిన సెమినార్లో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ లోధా మాట్లాడుతూ.. పిల్లలు వైరస్‌కు ప్రభావితం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనికి మొదటి కారణం ఒమిక్రాన్ అని తెలిపారు. అంతేగాక పిల్లలపై జాగ్రత్తలు తగ్గించడం, అన్ని ప్రాంతాలు పూర్తిగా అన్‌లాక్ అవ్వడం, సామూహికంగా సమావేశమడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు దధరించకపోడం వైరస్ వ్యాప్తికి మూల కారణమని తెలిపారు. అయితేవ్యాధి బారిన పడే పిల్లల సంఖ్య గణనీయంగా పెరగలేదని, కేసుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా కొద్దికొద్దిగా పెరిగాయని డాక్టర్ లోధా చెప్పారు. చదవండి: వైరల్ వీడియో: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు అమెరికాలోని ఆసుపత్రుల నుంచి వచ్చిన కొన్ని నివేదికలతో ప్రస్తుత వేవ్‌లో పిల్లలలో అనారోగ్యం తీవ్రత గురించి ఆందోళన పెరిగింది. ఆసుపత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్య పెరిగినట్లు చూస్తున్నారని ఎయిమ్స్, న్యూఢిల్లీ, డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. పిల్లలలో కోవిడ్-19 లక్షణాలు ► తేలికపాటి లక్షణాలు: జ్వరం, గొంతు నొప్పి, రైనోరియా, దగ్గు. చికిత్స: హోమ్ ఐసోలేషన్, పారాసెటమాల్ 10-15mg/kg/డోస్, ప్రతి 4-6 గంటలకు ఒకసారి వేసుకోవచ్చు. పెద్ద పిల్లలలో వెచ్చని సెలైన్ గార్గిల్స్, తగినంత పోషకాహారం తీసుకోవడం. ఎక్కువగా నీరు తాగడం. దగ్గును తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మోల్నుపిరవిర్, ఫ్లూవోక్సమైన్, సోర్ట్రోవిమాబ్ మొదలైనవి తీసుకోరాదు. ప్రమాద సంకేతాలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం రంగు మారడం, ఛాతీ నొప్పి, కొత్త గందరగోళం, ఏదైనా ద్రవాలను తాగడం లేదా ఉంచలేకపోవడం, మేల్కొని ఉన్నప్పుడు స్పందించకపోవడం మితమైన లక్షణాలు: వేగంగా శ్వాస తీసుకోవడం, ఆక్సిజన్ స్థాయి 90 నుంచి 94% మధ్య.ఉండటం చికిత్స: కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిలో చేరడం. -
ఎయిమ్స్, భువనేశ్వర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 90 ► విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు. ► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్బీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: సూచించిన పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021 ► వెబ్సైట్: https://aiimsbhubaneswar.nic.in ఐఎంఎంటీ, భువనేశ్వర్‌లో 14 ఖాళీలు భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్–ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 14 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి)–07, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్–అకౌంట్స్)–02, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ)–03, జూనియర్ స్టెనోగ్రాఫర్–02. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్–అకౌంట్స్): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ): వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ స్టెనోగ్రాఫర్: వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500–81,100 చెల్లిస్తారు. ► అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ(ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు) ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021 ► వెబ్సైట్: http://www.immt.res.in -
ఎయిమ్స్ పనులకు ఆటంకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆలిండియా ఇన్స్టీట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని కేంద్ర, కటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకాష్ నడ్డా అన్నారు. పలు ఆటంకాల కారణంగా నిర్మాణ పనులకు జాప్యం కలుగుతుందని రాజ్యసభకు తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణ జాప్యానికి గల కారణాల గురించి మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్డు ఎయిమ్స్ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాంతంలో ఉండటం, అలాగే ఎయిమ్స్ నిర్మాణానికి కేటాయించిన భూములను వ్యవసాయ భూముల నుంచి సంస్థ భూములుగా బదలాయించడంలో జరిగిన జాప్యం కారణంగా భవన నిర్మాణ పనులు మందగతిన సాగుతున్నట్లు మంత్రి చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణ ప్రాంతంలో రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో చేసిన ప్రతిపాదనను రద్దు చేయవలసిందిగా పలుమార్లు కోరిన మీదట జూన్ 2018లో ఏపీసీఆర్డీఏ అనుమతించినట్లు మంత్రి చెప్పారు.ఎయిమ్స్ నిర్మాణాలను ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారమే సెప్టెంబర్ 2020 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. తొలి దశ కింద ఓపీడీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పనులను సెప్టెంబర్ 2017లో ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 45 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. రెండో దశ కింద హాస్పిటల్, అకడమిక్ క్యాంపస్ నిర్మాణ పనులను మార్చి 2018లో ప్రారంభించగా ఇప్పటి వరకు 14 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు 231 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా అందులో 156 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. -
కీళ్ళనొప్పి ఎందుకు వస్తుంది?
అవగాహన దేహంలో కీళ్ళ మధ్య ఒత్తిడిని తగ్గించి మృదువైన కదలికలకు తోడ్పడే కార్టిలేజ్ (దేహంలో కీళ్ళు ఉన్నచోట ఉండే రక్షిత కణజాలం) క్షీణించడం మొదలైనప్పుడు వస్తుండే నొప్పినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. నొప్పితో పాటు కొందరిలో వాపు కూడా ఉంటుంది. ఇది తీవ్రస్ధాయికి చేరినప్పుడు అడుగుతీసి అడుగు వేయడం, చేతులు కదిలించడం కష్టమవుతుంది. దేహంలో కార్టిలేజ్ దెబ్బతిన్న ప్రదేశాన్ని బట్టి బాధ తీవ్రత ఉంటుంది. ఆర్థరైటిస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా జన్యుపరమైన అవసవ్యతల వల్ల ఇలా జరుగుతుంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆర్థోపీడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ శిశిర్ రస్తోగీ అంటున్నారు. గంటల తరబడి కుర్చీలోంచి కదలకుండా పని చేయడం, స్థూలకాయం, వ్యాయామానికి తావు లేని జీవన శైలి, పౌష్ఠికాహార లోపం... ఆర్థరైటిస్‌కు ఇతరత్రా కారణాలు. కొన్ని సార్లు ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్‌గా పొరబడుతుంటారు. అవగా హన లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఇవి రెండూ రెండు రకాల సమస్యలు. ఎముకలు డొల్ల బారడం... ఆస్టియోపోరోసిస్. కీళ్ళ నొప్పులు... ఆస్టియో ఆర్థరైటిస్. మనదేశంలో రెండూ ఎక్కువే. ప్రైమరీ, సెకండరీ అని ఆర్థరైటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు ప్రైమరీ. ఏదైనా వ్యాధి కారణంగా, గాయం వల్లా వచ్చే ఆర్థరైటిస్.... సెకండరీ. ‘‘ఆర్థరైటిస్‌ను నివారించేందుకు ఉన్న అత్యుత్తమ మైన మార్గం వ్యాయామం. క్రమబద్ధంగా, సవ్యంగా వ్యాయామం చేస్తుండాలి. బైఠాయించి నట్లు కూర్చుండిపోవడం, కాళ్ళుకత్తెరలా పెట్టి కూర్చోవడం మంచిది కాదు. అలాగే ఎప్పటి కప్పుడు బరువు చూసుకుంటుండాలి. బరువు పెరిగితే కీళ్ళు ఒత్తిడికిలోనై కార్టిలేజ్ బలహీన పడే ప్రమాదం ఉంది. ఒంట్లో యూరిక్ ఆసిడ్ నిల్వలు ఎక్కువైనప్పుడు కూడా ఆర్థరైటిస్ రావచ్చు’’ అని సర్ గంగారామ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపీడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ తల్వార్ అంటున్నారు. -
రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నతమైన వైద్యసేవల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తమిళనాడు శిగపై మరో కీర్తికిరీటం అలంక రణ కానుంది. వైద్య చరిత్రలో భారతదేశంలో పేరెన్నిక గన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రి రాష్ట్రానికి రానుంది. ఎయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించేందుకు ేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి చేరుకోనుంది.సాధారణ వైద్యంతోపాటు నేత్ర చికిత్సలో చెన్నై సుప్రసిద్ధిగా నిలిచింది. దేశం నలుమూలల నుంచేగాగ విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రోగులు చెన్నైలో వైద్యానికి ప్రాధాన్యత నిస్తుంటారు. ముఖ్యంగా అరబ్, ఆఫ్రికా దేశాల వారికి చెన్నైలో వైద్యం అంటే ఎంతో నమ్మకం. దేశీయుల కంటే విదేశీయులతోనే ఇక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతుంటాయి. చెన్నై సెంట్రల్ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వాత్రి (జీహెచ్)లో అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇదిగాక రాయపేట, స్టాన్లీ, కీల్పాక్, ఎగ్మూరులోని తల్లి, పిల్లల ఆస్పత్రి ఇలా ఎన్నో ఆస్పత్రులున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చివేసింది. ఈ ఆస్పత్రి ద్వారా ఎయిమ్స్ తరహా వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఎయిమ్స్ ప్రవేశం ఇప్పటికే అత్యున్న వైద్యసేవల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులో ఏకంగా ఎయిమ్స్ ఆస్పత్రులే ప్రవేశిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులో నాలుగు లెక్కన ఐదు ఎయిమ్స్ ఆస్పత్రులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పేందుకు కనీసం 200 ఎకరాలు అవసరం. ఈ స్థలం నగరానికి అనుకునే ఉండాలి, రోడ్డు మార్గం, రైలు, విమాన మార్గం, రవాణా, తాగునీరు, విదుత్ తదితర ప్రాథమిక వసతులు కలిగి ఉండాలి. ఎయిమ్స్‌కు అనుకూలమైన స్థలం తిరుచ్చిరాపల్లి-తంజావూరు మార్గంలోని చెంగిపట్టి, పుదుక్కోట్టైలో పశుసంవర్థకశాఖకు చెందిన స్థలం, చెంగల్పట్టు, మధురై సమీపం తోప్పూర్, ఈరోడ్డు జిల్లా పెరుందురై... ఈ ఐదు స్థలాలను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది. అంతేగాక వెంటనే ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. గత ఏడాది ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధాని మోదీని కలిసినపుడే ఐదు స్థలాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించారు. త్వరలో ఒక కేంద్ర బృందం సదరు ఐదు స్థలాలను సర్వే చేసేందుకు రాష్ట్రానికి రానుంది. రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించి ఇందులో ఒకదానిని ఖరారు చేస్థారా లేక మరి కొన్ని స్థలాలను సూచించాల్సిందిగా కోరుతారా అనేది సర్వే పూర్తయితేగానీ తెలియదు. -
అందుబాటులోకి మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
న్యూఢిల్లీ: నగరంలో మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ఉత్తర ఢిల్లీలోని బురారీ, దక్షిణఢిల్లీలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.రెండు ఆస్పత్రులూ 200 పడకల సామర్థ్యం కలిగి ఉన్నవేనని వారు చెప్పారు. వీటిలో న్యూరాలజీ, గైనకాలజీ, చిన్నారులకు సంబంధించి ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కొన్ని కారణాల ఈ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులను వేగిరవంతం చేశామన్నారు. మరో మూడు నెలల్లో నిర్మాణ పనులుపూర్తయిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్), సబ్దర్‌జంగ్ ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడిని తగ్గించేందుకు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకాలో రూ. 570 కోట్ల అంచనా వ్యయంతో 700 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ ఆస్పత్రి కూడా మరో ఏడాదిలో రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి భారతరత్న ఇందిరాగాంధీ ఆస్పత్రిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వ ం కింద పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా లాల్‌బహదూర్ శాస్త్రి ఆస్పత్రి, లోక్‌నాయక్ ఆస్పత్రులకు చెరో 45 డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయని ఆయన వివరించారు. -
ఎయిమ్స్‌లో ఆన్లైన్ సేవలకు కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వాసుపత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) పడకల స్థాయిని విస్తరించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ ఆపరేషన్ల కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది. పడకల సంఖ్య తక్కువగా ఉం డడంతో నెలలు, సంవత్సరాలపాటు వివిధ ఆపరేషన్ల కోసం రోజులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ నిరీక్షణ కాలం వ్యాధి తీవ్రతను బట్టి, నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అడ్మిషన్ ప్రక్రియ సరళీకరణ: ఇందులో భాగంగా రోగుల అడ్మిషన్ ప్రక్రియను సరళీకరించి సౌకర్యవంతంగా, పారదర్శకంగా అడ్మిషన్ ప్రక్రియను తీర్చిదిద్దడం కోసం ఆన్లైన్ ద్వారా పడకలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రోగులు ఇంటి వద్ద నుంచే అసుపత్రిలో ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రిలో పడక లభ్యత గురించిన సమాచారాన్ని ఎయిమ్స్ ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తుంది. దాని వల్ల రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ తిర గాల్సిన పనిలేదు. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది రోగులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోంది. కేటాయించిన రోజు రోగులను ఆసుపత్రికి తీసుకొని రావచ్చని ఎయిమ్స్ సీనియర్ అధికారి పేర్కొన్నారు. రోజూ 10 వేల మంది రోగుల రాక: ఎయిమ్స్ ఓపీడీ విభాగాన్ని రోజుకు పదివేల మంది సందర్శిస్తారు. న్యూరాలజీ, కార్డియాలజీ, కేన్సర్, పిడియాట్రిక్ ,ఈఎన్టీ విభాగాలలో రోగుల సంఖ్యఎక్కువగా ఉంటుంది. 2,400 పడకలు కల ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ల కోసం నిరీక్షాంచాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆపరేషన్ తేదీ ముందుగానే లభించిన ప్పటికీ పడకలు ఖాళీగా లేకపోవడం జాప్యం జరుగుతోంది. పడక ఎప్పుడు దొరుకుతుందో తెలుసుకోవడం కోసం రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ ఏళ్లతరబడి తిరుగాల్సి వచ్చేంది. డబ్బులు తీసుకుని ఆసుపత్రి సిబ్బంది పడక కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ సమస్యలను నివారించడం కోసం పడకల కేటాయింపు సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందించాలని ఎయిమ్స్ యోచిస్తోందని అధికారులు పేర్కొన్నారు. -
భూముల అన్వేషణ
- ‘ఎయిమ్స్’ ఏర్పాటు కోసం - జల్లెడ పడుతున్న జిల్లా యంత్రాంగం - రెండు ప్రాంతాల్లో అనువైన స్థలాల గుర్తింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ర్టంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో భూముల అన్వేషణపై యంత్రాంగం దృష్టి సారించింది. హైదరాబాద్ నగరానికి చేరువలోనే ఈ ప్రాజె క్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు దిగిన అధికారులు శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదరహిత భూమిని గుర్తించారు. అదేవిధంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లోనూ అనువైన స్థలం ఉందని నిర్ధారించారు. అన్నీ ఒక్క చోటేనా! హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అనువైన భూములు అందుబాటులో ఉండడంతో పలు ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటయ్యాయి. హైటెక్ సిటీ మొదలు కీలక ఐటీ సంస్థలు, టీఐఎఫ్ఆర్, ఐఎంజీ భారత్ తదితర సంస్థలన్నీ శేరిలింగంపల్లి మండల పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో శరవేగంగా అభివృద్ధి చెందిన శేరిలింగంపల్లిలో తాజాగా ఎయిమ్స్ ఏర్పాటు చేయడంపై పలువర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కీలక సంస్థలన్నీ ఒకేచోట ఏర్పాటైతే.. మిగతా ప్రాంతం అభివృద్ధిపై ప్రభావం పడుతుందని జిల్లా యంత్రాంగం సైతం వాదిస్తోంది. ఈ క్రమంలో శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై పరిశీలన చేస్తోంది. జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం.. జిల్లాలోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించగా.. ఈమేరకు భూముల పరిస్థితిని పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులు శేరిలింగంపల్లిలోని సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో, శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ సమీపంలో స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ ఫైలును సీఎం కేసీఆర్ పరిశీలించిన తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం'
ఏయిమ్స్ కమిటీ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... విభజనతో సీమాంధ్రలో కొన్ని వందల మెడికల్ సీట్లు కోల్పోయామని ఆయన తెలిపారు. సీమాంధ్రలో కోల్పోయిన మెడికల్ సీట్లు తిరిగి పొందెందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కలుస్తామని ఆయన వివరించారు. -
సోనియా డిశ్చార్జి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం తెల్లవారుజామున అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఎయిమ్స్‌లో చేరిన సోనియా సుమారు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. అన్నిరకాల వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లారు. మంగళవారం ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేదు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సోనియాజీ ఇంటికి తిరిగి వచ్చారని, ఆమె ఇప్పుడు బాగానే ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. ‘ఆమె దగ్గు, తలనొప్పితో బాధపడ్డారు. మందులు తీసుకున్న తర్వాత పార్లమెంటులో ఉన్నప్పుడు కొంత నలతగా ఉన్నట్టు భావించారు. అందుకే ఆస్పత్రికి వచ్చారు..’ అని ఎయిమ్స్ డెరైక్టర్ ఆర్.సి.డేకా చెప్పారు. అలాంటి వ్యాధులకు చేయాల్సిన పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎలాంటి సమస్యా లేదని గుర్తించామన్నారు. మేడమ్ త్వరలోనే తిరిగి పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ చెప్పారు. ఇలావుండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు త్వరగా కోలుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ సందేశంలో ఆకాంక్షించారు. సోనియాను అన్ని సౌకర్యాలు ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి ఉండాల్సిందని పేర్కొన్నారు. సోనియాజీ ఆరోగ్యం మెరుగుపడిందనే వార్త ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మంచి ఆరోగ్యంతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విపక్ష నేత సుష్మాస్వరాజ్ సహా పలువురు నేతలూ ఆమె ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.