చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నతమైన వైద్యసేవల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తమిళనాడు శిగపై మరో కీర్తికిరీటం అలంక రణ కానుంది. వైద్య చరిత్రలో భారతదేశంలో పేరెన్నిక గన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రి రాష్ట్రానికి రానుంది. ఎయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించేందుకు ేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి చేరుకోనుంది.సాధారణ వైద్యంతోపాటు నేత్ర చికిత్సలో చెన్నై సుప్రసిద్ధిగా నిలిచింది. దేశం నలుమూలల నుంచేగాగ విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రోగులు చెన్నైలో వైద్యానికి ప్రాధాన్యత నిస్తుంటారు. ముఖ్యంగా అరబ్, ఆఫ్రికా దేశాల వారికి చెన్నైలో వైద్యం అంటే ఎంతో నమ్మకం. దేశీయుల కంటే విదేశీయులతోనే ఇక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతుంటాయి. చెన్నై సెంట్రల్ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వాత్రి (జీహెచ్)లో అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇదిగాక రాయపేట, స్టాన్లీ, కీల్‌పాక్, ఎగ్మూరులోని తల్లి, పిల్లల ఆస్పత్రి ఇలా ఎన్నో ఆస్పత్రులున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చివేసింది. ఈ ఆస్పత్రి ద్వారా ఎయిమ్స్ తరహా వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.
ఎయిమ్స్ ప్రవేశం
ఇప్పటికే అత్యున్న వైద్యసేవల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులో ఏకంగా ఎయిమ్స్ ఆస్పత్రులే ప్రవేశిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులో నాలుగు లెక్కన ఐదు ఎయిమ్స్ ఆస్పత్రులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తాజా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పేందుకు కనీసం 200 ఎకరాలు అవసరం. ఈ స్థలం నగరానికి అనుకునే ఉండాలి, రోడ్డు మార్గం, రైలు, విమాన మార్గం, రవాణా, తాగునీరు, విదుత్ తదితర ప్రాథమిక వసతులు కలిగి ఉండాలి. ఎయిమ్స్‌కు అనుకూలమైన స్థలం తిరుచ్చిరాపల్లి-తంజావూరు మార్గంలోని చెంగిపట్టి, పుదుక్కోట్టైలో పశుసంవర్థకశాఖకు చెందిన స్థలం, చెంగల్పట్టు, మధురై సమీపం తోప్పూర్, ఈరోడ్డు జిల్లా పెరుందురై... ఈ ఐదు స్థలాలను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది. అంతేగాక వెంటనే ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. గత ఏడాది ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధాని మోదీని కలిసినపుడే ఐదు స్థలాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్‌లో ప్రకటించారు. త్వరలో ఒక కేంద్ర బృందం సదరు ఐదు స్థలాలను సర్వే చేసేందుకు రాష్ట్రానికి రానుంది. రాష్ట్రం సిద్ధం చేసిన ఐదు స్థలాలను పరిశీలించి ఇందులో ఒకదానిని ఖరారు చేస్థారా లేక మరి కొన్ని స్థలాలను సూచించాల్సిందిగా కోరుతారా అనేది సర్వే పూర్తయితేగానీ తెలియదు.
రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రులు
Published Tue, Mar 3 2015 1:58 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement