సాక్షి,మంగళగిరి : ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.
అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది. ప్రతి సంవత్సరం నిర్వహించాలి. పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు.
దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను.
ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం.ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి.యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’’ అని అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ
అనంతరం రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది.ప్రతి సంవత్సరం నిర్వహించాలి.కాన్వకేషన్ మీకు ఒక గుర్తింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణ మహిళ, గిరిజన మహిళగా భారత ప్రథమ మహిళ అయ్యారు. ఉపాధ్యాయినిగా అంచెలంచెలుగా రాష్ట్రపతి అయ్యారు ’అని చంద్రబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment