ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర | Sakshi Interview About AIIMS-Delhi Director Dr M Srinivas | Sakshi
Sakshi News home page

ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర

Published Thu, Dec 26 2024 6:32 AM | Last Updated on Thu, Dec 26 2024 6:32 AM

Sakshi Interview About AIIMS-Delhi Director Dr M Srinivas

ముందస్తు రోగ నిర్ధారణ, మెరుగైన చికిత్సలో ఏఐ పాత్ర పెరుగుతోంది 

ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏఐ వినియోగం 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)– ఢిల్లీ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. 

ఎయిమ్స్‌–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్‌ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్‌ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. 

ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్‌తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్‌లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్‌ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్‌ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్‌ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 

4 వేలకు చేరువలో బెడ్‌లు..: ప్రస్తుతం ఎయిమ్స్‌కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్‌ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్‌ వరకు 2,600 వరకు బెడ్‌లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్‌లోనే ఏకంగా 425 బెడ్‌లను పెంచగా, సర్జికల్‌ బ్లాక్‌లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్‌ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్‌ల ఆధారంగా టెలీకన్సల్టేషన్‌ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.  

రోగుల సహాయకులకు 1,516 బెడ్‌లు.. 
ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్‌లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్‌ షటిల్‌బస్‌ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్‌ఆర్‌ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఏకంగా రూ.108 కోట్లు అందించింది.  

డిజిటల్‌ పాలన.. 
ఎయిమ్స్‌లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్‌ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్‌ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్‌ ఒక్కటే. ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఫిజికల్‌ ఫైల్స్‌ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ రీఫారŠమ్స్‌లో భాగంగా స్టోర్‌లలో ఆటోమేషన్, డిజిటల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్‌లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్‌ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ల వరకు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement