M Srinivas
-
ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్ రణదీప్ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్ సర్జన్ (కార్డియో వ్యాస్కులర్ స్పెషలిస్ట్) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు. -
‘సినిమా టికెట్ల ధరలు తగ్గించండి’
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన జీఎస్టీ ప్రకారం వెంటనే సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జనవరి 1 నుంచి రూ.100కు మించి ఉన్న సినిమా టికెట్ల ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని, తగ్గించిన ధరల ప్రకారం టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అనేదానిపై సినిమాహాళ్లపై శనివారం జీఎస్టీ అధికారుల బృందం దర్యాప్తు చేసిందన్నారు. ప్రసాద్ఐమాక్స్ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిందని, దీనిపై కేసు నమోదు చేసి ‘యాంటీ ప్రొఫెటీరింగ్ సంస్థ’కు అప్పగించామని చెప్పారు. అన్ని సినిమాహాళ్ల యాజమానులు తగ్గించిన జీఎస్టీ ప్రకారం టికెట్లు అమ్మాలని, తగ్గించని వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. -
నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఆమెకు తండ్రి ఎవరో తెలీదు మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి రమ్యపై జేడీఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ వ్యక్తిగత దూషణలకు పాల్ప డి వివాదం రాజేశారు. ‘‘నటి రమ్యకు ప్రజా, రైతు సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లాలో ఎన్ని చక్కెర కర్మాగారాలున్నాయో ఆమెకు తెలుసా? అసలు ఆమె తండ్రి ఎవరో.. ఏ సామాజిక వర్గానికి చెందినదో ఆమెకే తెలియదు. ఏ ప్రాంతానికి చెందినదో కూడా తెలియదు. అలాంటి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కావడం సిగ్గుచేటు’’ అని శ్రీరంగపట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. శ్రీనివాస్ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమేనని కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ మండిపడ్డారు.