నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | Ramya does not know where she hails from, says JD(S) leader about actor, stirs controversy | Sakshi
Sakshi News home page

నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sat, Aug 10 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆమెకు తండ్రి ఎవరో తెలీదు
 మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి రమ్యపై జేడీఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ వ్యక్తిగత దూషణలకు పాల్ప డి వివాదం రాజేశారు. ‘‘నటి రమ్యకు ప్రజా, రైతు సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లాలో ఎన్ని చక్కెర కర్మాగారాలున్నాయో ఆమెకు తెలుసా? అసలు ఆమె తండ్రి ఎవరో.. ఏ సామాజిక వర్గానికి చెందినదో ఆమెకే తెలియదు. ఏ ప్రాంతానికి చెందినదో కూడా తెలియదు. అలాంటి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కావడం సిగ్గుచేటు’’ అని శ్రీరంగపట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. శ్రీనివాస్ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమేనని కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement