కర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివానంద పాటిల్(54) గుండెపోటు కారణంగా అకాల మరణం చెందారు. కాగా, పాటిల్‌కు ఇటీవలే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జేడీఎస్ అధిస్టానం సీటును ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆయన ఇలా మృతిచెందడం కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
వివరాల ప్రకారం.. కర్నాటకలో రాబోయే ఎన్నికల్లో సిందగీ అసెంబ్లీ స్థానం నుంచి తనకు ఎమ్మెల్యే సీటు ఖరారు కావడంతో శివానంద పాటిల్ ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుగా గురయ్యారు. గుండెపోటు వచ్చిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఆయన మృతిచెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక, శివానంద పాటిల్.. భారత సైన్యంలో సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జేడీఎస్ నుంచి రాజకీయాల్లోకి అరగ్రేటం చేశారు. కాగా, రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలోనే ఆయన ఇలా మృతిచెందారు. శివానంద పాటిల్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
మరోవైపు.. శివానంద పాటిల్ మృతిపై జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామితో సహ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పాటిల్ ఆత్మకు శాంతి కలుగాలని, ఆయన కుటుంబానికి అంతా మంచే జరిగేలా దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరారు.
21 Jan 2023 : 🇮🇳 : Karnataka : JDS leader Shivanand Patil dies of 💔attack💉, was to contest assembly elections from Sindgi seathttps://t.co/DxAOwwVGxC#heartattack2023 #heartattack #BeastShotStrikesAgain pic.twitter.com/ktzuo3OdNN
— Anand Panna (@AnandPanna1) January 21, 2023
Comments
Please login to add a commentAdd a comment