JDS leader
-
జేడీఎస్ నేత యువతులతో రాసలీలలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
రాయచూరు రూరల్: జేడీఎస్ యువ విద్యార్థి విభాగం అధ్యక్షుని రాసలీలలు బయట పడ్డాయి. శుక్రవారం దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అమాయక యువతులను వలలో వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విడివిడిగా వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడం సంచలనం కలిగించింది. ఇలా యువతుల బతుకులను బుగ్గిపాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో జేడీఎస్ సీనియర్ నేతలు స్పందిస్తూ వ్యక్తిగతంగా వారి మధ్య వ్యవహారం ఉండవచ్చన్నారు. -
కర్నాటకలో విషాదం.. జేడీఎస్ నేత హఠాన్మరణం
కర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివానంద పాటిల్(54) గుండెపోటు కారణంగా అకాల మరణం చెందారు. కాగా, పాటిల్‌కు ఇటీవలే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జేడీఎస్ అధిస్టానం సీటును ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆయన ఇలా మృతిచెందడం కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వివరాల ప్రకారం.. కర్నాటకలో రాబోయే ఎన్నికల్లో సిందగీ అసెంబ్లీ స్థానం నుంచి తనకు ఎమ్మెల్యే సీటు ఖరారు కావడంతో శివానంద పాటిల్ ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుగా గురయ్యారు. గుండెపోటు వచ్చిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఆయన మృతిచెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక, శివానంద పాటిల్.. భారత సైన్యంలో సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జేడీఎస్ నుంచి రాజకీయాల్లోకి అరగ్రేటం చేశారు. కాగా, రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలోనే ఆయన ఇలా మృతిచెందారు. శివానంద పాటిల్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మరోవైపు.. శివానంద పాటిల్ మృతిపై జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామితో సహ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పాటిల్ ఆత్మకు శాంతి కలుగాలని, ఆయన కుటుంబానికి అంతా మంచే జరిగేలా దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరారు. 21 Jan 2023 : 🇮🇳 : Karnataka : JDS leader Shivanand Patil dies of 💔attack💉, was to contest assembly elections from Sindgi seathttps://t.co/DxAOwwVGxC#heartattack2023 #heartattack #BeastShotStrikesAgain pic.twitter.com/ktzuo3OdNN — Anand Panna (@AnandPanna1) January 21, 2023 -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బేరసారాలు ఆడుతోందని ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయొద్దని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించారని మండిపడ్డారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సిద్ధరామయ్య కూడా ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: సిగ్నల్ జంప్! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య ఓ లేఖ రాశారని వస్తున్న వార్తలపై కూడా కుమారస్వామి స్పందించారు. ‘సిద్ధరామయ్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ ఎమ్మెల్యేలకు తాను లేఖ రాయలేదని చెప్పారు. కానీ ఇప్పటికే ఆ లేఖను సిద్ధరామయ్య ట్విటర్లోనూ పోస్ట్ చేరు. నిన్న లేఖ రాశానని చెప్పిన సిద్ధరామయ్య నేడు రాయలేదని అంటున్నారు. తన మాటలను ఆయనే కొట్టిపారేస్తున్నారు. ఈ తీరు ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది’ అని మండిపడ్డారు. #WATCH | I have voted for Congress because I love it: K Srinivasa Gowda, Karnataka JD(S) leader on Rajya Sabha elections pic.twitter.com/oMSkdlYSuQ — ANI (@ANI) June 10, 2022 -
నాకెవరు సంస్కారం నేర్పాల్సిన పనిలేదు
బెంగళూరు : సుమలత అంబరీశ్‌పై తరచూ విమర్శలు చేసే జేడీఎస్‌నేత, రవాణా మంత్రి తమ్మణ్ణ మరోసారి వాగ్బాణాలు సంధించారు. దివంగత మాజీ మంత్రి అంబరీశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటికి వెళ్లిన ప్రజలు, నేతల్లో ఎంతమందిని సుమలత పలకరించారు, ఎంతమందికి కనీసం తాగడానికి నీళ్లిచ్చారు? అని రవాణాశాఖ మంత్రి, జేడీఎస్ నేత డీసీ తమ్మణ్ణ అన్నారు. గురువారం మద్దూరు తాలూకా అతగూరు హోబళి మాచహళ్లి, కంప్లాపుర, కూళగెరె, కబ్బారె తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడారు. అంబరీశ్ ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న జిల్లా ప్రజల, రైతుల గురించి సుమలత ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం అంబరీశ్ పేరు చెప్పుకొని ప్రజలను ఉద్ధరిస్తామంటూ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత కూడా ఇటువంటి మాయమాటలు చెప్పే ఎంపీగా పోటీ చేసి గెలిచాక మండ్య జిల్లా ప్రజలను మధ్యలోనే వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారంటూ పరోక్షంగా నటి రమ్యపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలంటూ సుమలతపై తామేమి ఒత్తిడి చేయబోమని, పోటీ అనేది ఆమె వ్యక్తిగత విషయమన్నారు. ఎవరో వందమంది జనాలు నాలుగు బస్సుల్లో బెంగళూరుకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పిలిచినంత మాత్రానా జిల్లా ప్రజలంతా పిలిచినట్లుగా సుమలత భ్రమ పడుతున్నారన్నారు. 18 లక్షల మంది ఓటర్లు ఉన్న మండ్య జిల్లాను అభివృద్ధి చేయాల్సిన వారే చేస్తారు తప్ప ఇతరులు అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. నిఖిల్ కుమార స్వామి రక్తంలోనే రాజకీయం ఉందని, రాజకీయాల్లో అడుగుపెట్టడానికి నిఖిల్‌కు అనుభవం అవసరం లేదన్నారు. అర్థంపర్థం లేకుండా మాట్లాడొద్దు : సుమలత అతిథులను ఎలా గౌరవించాలో, ఎలా సత్కరించాలో అంబరీశ్ కుటుంబానికి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, అంతటి దుస్థితి మాకు పట్టలేదు అని మంత్రి తమ్మణ్ణ చేసిన వ్యాఖ్యలకు సుమలత కౌంటర్ ఇచ్చారు. మంత్రి తమ్మణ్ణ ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చారో, ఎన్నిసార్లు నీళ్లు తాగారో అదే విధంగా తాము తమ్మణ్ణ ఇంటికి ఎన్నిసార్లు వెళ్లామనే వివరాలను ఆయన కుటుంబ సభ్యులే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే నేరుగా తమకు చెప్పకుండా ఈ విధంగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ‘అంబరీశ్ పేరు చెప్పుకొని ఎవరెవరు ఏమేం పొందారో, ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికి తెలుసు. అర్థం లేని విధంగా విమర్శలు చేయడం వారి సంస్కారం. మాట్లాకుండా మౌనంగా ఉండడం మా సంస్కారం. అంబరీశ్ ఉన్న సమయంలో ఎవరెవరూ మా ఇంటికి వచ్చారో, మేము ఎవరింటికి వెళ్లామో ప్రతీ ఒక్కరికీ తెలుసు. దీనిపై మేము వ్యాఖ్యానించదలచుకోలేదు’ అన్నారు. సీఎం తనయుడూ రంగులు వేసుకున్నవాడే ముఖాలకు రంగులు వేసుకునే వ్యక్తులను నమ్మొద్దంటూ డీసీ తమ్మణ్ణ చేసిన వ్యాఖ్యలపై సుమలత స్పందిస్తూ.. ముఖానికి రంగులు వేసుకున్న ఎవరూ రాజకీయాల్లో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. మండ్యలో జేడీఎస్ తరపున పోటీ చేయనున్న నిఖిల్ కూడా ముఖానికి రంగులు వేసుకునే వ్యక్తేనని ,సీఎం కుమారస్వామి కూడా ముఖానికి రంగులు వేసుకునే సినిమా రంగంలోనే చాలా ఏళ్లు ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. -
హెచ్డీ రేవణ్ణకు మళ్లీ పెళ్లి
హాసన్(బొమ్మనహళ్లి): జేడీఎస్ నాయకుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. ఆయన పెళ్ళి చేసుకుంది ఎవరినో కాదు, భార్య భవానీనే. ఇటీవలే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన షష్టిపూర్తి వేడుకను తల్లిదండ్రులు దేవెగౌడ, చెన్నమ్మ, తనయుడు ప్రజ్వల్, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తన భార్య భవాని మెడలో మూడుముళ్లు వేశారు. ఈ వేడుకలు హాసన్‌లోని జ్ఞానాక్షి కన్వెన్షన్ హాల్లో సందడిగా జరిగాయి. ఆదిచంచనగిరి మఠం అధిపతి శ్రీనిర్మలానందనాథ స్వామి పాల్గొని రేవణ్ణ దంపతులను ఆశీర్వదించారు. -
గడ్డుకాలం...
సాక్షి, బెంగళూరు : ప్రస్తుతం జేడీఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. నాయకుల మధ్య భేదాబిప్రాయాలు ఉన్నమాట వాస్తవమని వాటిని కొలిక్కి తెచ్చే సామర్థ్యం తనకుందన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ బృహత్ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యక్షంగానే జేడీఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ నిషిత దృష్టితో గమనిస్తున్నానన్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ వయసులో కూడా పార్టీని పటిష్ట పరిచే సామర్థ్యం తనకుందన్నారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉన్నవారు తనతో పాటు ఉండవచ్చునని లేదా పార్టీని వదిలీ ఇతర పార్టీలోకి వెళ్లవచ్చునని పునరుద్ఘాటించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకుడు రేవణ్ణ ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమన్నారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కుమారస్వామి కాంగ్రెస్‌లో చేరుతున్నారని పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జేడీఎస్ కుటుంబ పార్టీ అనే అపవాదును పోగొట్టడానికి ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఇదే వేదికపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో సిద్ధరామయ్య ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. పార్టీలోని అందరి నాయకులను కలుపుకుని పోయి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. వేదిక నుంచి దిగిపోయిన జేడీఎస్ నాయకులు దేవెగౌడ ప్రసంగం తర్వాత వేదికపై ఉన్న పలువురు నాయకులు మాట్లాడటానికి పోటీ పడ్డారు. ఒకరి చేతిలో ఉన్న మైకును మరొకరు బలవంతంగా లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. దీంతో నొచ్చుకున్న పార్టీ సీనియర్ నాయకులు ఎం.సి.నాణయ్య, పుట్టణ్ణ, రేవణ్ణ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా వేదిక కింద ఉన్న ఓ కార్యకర్త మైకును తీసుకుని ‘ఇతర పార్టీలోకి వెళ్లే వారి విషయం కాదు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారిపై దృష్టి సారించండి. బ్యాటరాయణపుర, యశ్వంతపుర నియోజక వర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ.’ అంటూ గట్టిగా మాట్లాడుతుండంగానే మరో నాయకుడు అతని వద్ద నుంచి మైకును లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కల్పించుకున్న దేవెగౌడ ‘ఇలాంటి కార్యకర్తలే కావాలి. అతని వద్దమైకును బలవంతంగా తీసుకోకండి. ఇలా చేస్తే మన మధ్య విభేదాలు బయటపడ్డాయనే మీడియా వాఖ్యానిస్తుంది.’ అని పేర్కొన్నారు. తర్వాత కుమారస్వామితో పాటు పలువురు నాయకులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వేదిక పై నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. -
‘ఓటుకు నోటు’పై కేంద్రానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల శాసన సభ నుంచి శాసన మండలికి జరగాల్సిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన నాయకునికి ఎమ్మెల్యేలు రూ.కోటి చొప్పున అడుగుతున్నారని జేడీఎస్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పినట్లు విడుదలైన సీడీపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీనిపై నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపా రు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో నివేదికను పంపుతామని చెప్పారు. బీజాపుర జిల్లాకు చెందిన జేడీఎస్ నాయకుడు విజు గౌడ పాటిల్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరినప్పుడు ‘పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు రూ.40 కోట్లు అడుగుతున్నారు’ అని కుమార స్వామి చెప్పడం వివాదాస్పదంగా మారింది. మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే దీనిపై రాజకీయ పార్టీలన్నిటినీ తూర్పారబట్టారు. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని అన్ని పార్టీల వారు ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా కుమార తీరుపై ధ్వజమెత్తాయి. -
శరద్ యాదవ్‌ను కలిసిన చంద్రబాబు
-
నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఆమెకు తండ్రి ఎవరో తెలీదు మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి రమ్యపై జేడీఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ వ్యక్తిగత దూషణలకు పాల్ప డి వివాదం రాజేశారు. ‘‘నటి రమ్యకు ప్రజా, రైతు సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లాలో ఎన్ని చక్కెర కర్మాగారాలున్నాయో ఆమెకు తెలుసా? అసలు ఆమె తండ్రి ఎవరో.. ఏ సామాజిక వర్గానికి చెందినదో ఆమెకే తెలియదు. ఏ ప్రాంతానికి చెందినదో కూడా తెలియదు. అలాంటి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కావడం సిగ్గుచేటు’’ అని శ్రీరంగపట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. శ్రీనివాస్ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమేనని కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ మండిపడ్డారు.