
షష్టిపూర్తి వేడుకలో భార్య భవానీకి తాళి కడుతున్న రేవణ్ణ
హాసన్(బొమ్మనహళ్లి): జేడీఎస్ నాయకుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. ఆయన పెళ్ళి చేసుకుంది ఎవరినో కాదు, భార్య భవానీనే. ఇటీవలే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన షష్టిపూర్తి వేడుకను తల్లిదండ్రులు దేవెగౌడ, చెన్నమ్మ, తనయుడు ప్రజ్వల్, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తన భార్య భవాని మెడలో మూడుముళ్లు వేశారు. ఈ వేడుకలు హాసన్‌లోని జ్ఞానాక్షి కన్వెన్షన్ హాల్లో సందడిగా జరిగాయి. ఆదిచంచనగిరి మఠం అధిపతి శ్రీనిర్మలానందనాథ స్వామి పాల్గొని రేవణ్ణ దంపతులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment