Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు | Lok sabha elections 2024: Former CM Kumaraswamy files nomination from Mandya Lok Sabha seat | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు

Published Fri, Apr 5 2024 6:24 AM | Last Updated on Fri, Apr 5 2024 6:24 AM

Lok sabha elections 2024: Former CM Kumaraswamy files nomination from Mandya Lok Sabha seat - Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మాండ్య లోక్‌సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్‌ వేశారు. ఎన్నికల అఫిడివిట్‌లో తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచారు.

తమకు రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కుమారస్వామికి రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా ఆయన భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయి. తమ ఉమ్మడి కుటుంబంలో తన పేరిట మరో రూ.8.17 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement