LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్‌.. ఓటింగ్‌ శాతం ఎంతంటే.. |Lok Sabha Elections 2024 Phase 3 Polling Live Updates And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్‌.. ఓటింగ్‌ శాతం ఎంతంటే..

Published Tue, May 7 2024 7:02 AM | Last Updated on Tue, May 7 2024 5:08 PM

lok sabha election 2024: Phase 3 polling updates in telugu

updates

 

  • మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • 11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది.

 

  • మధ్యాహ్నం 3 గంటల వరకు 50.71 శాతం ఓటింగ్ నమోదైంది. 
  • పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 63.11 శాతం, మహారాష్ట్రలో అత్యల్పంగా 42.63 శాతం పోలింగ్ నమోదైంది.

 

  • అదాని గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదాని ఓటు వేశారు.

  • మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • భారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.
  • ఉదయం 11 గంటల 25.41 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • అస్సాం-27.34%
  • బీహార్-24.41% 
  • ఛత్తీస్‌గఢ్-29.90% 
  • దాద్రా అండ్‌ నగర్ హవేలీ, డామన్ అండ్‌ డయ్యూ- 24.69% 
  • గోవా-30.94% 
  • గుజరాత్- 24.35% 
  • కర్ణాటక-24.48% 
  • మధ్యప్రదేశ్-30.21% 
  • మహారాష్ట్ర-18.18% 
  • ఉత్తరప్రదేశ్-26.12% 
  • పశ్చిమ బెంగాల్-32.82%

ఉత్తరప్రదేశ్‌

  • ఓటు వేసిన అఖిలేష్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌
  • సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌,ఆయన భార్య మైన్‌పూరి ఎస్పీ అభ​ర్థి డింపుల్‌ యాదవ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లోని సైఫై పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


     

మహారాష్ట్ర

  • బారామతి ఎన్సిపీ శరద్‌ చంద్ర పవార్‌ పార్టీ అభ్యర్థి సుప్రియా సూలే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

పశ్చిమ బెంగాల్‌

  • జంగీపూర్‌ పోలింగ్‌ కేంద్ర వద్ద ఘర్షణ చోటుచేసుకుంది
  • టీఎంసీ బూత్‌ ప్రెసిడింట్‌, బీజేపీ అభ్యర్థి ధనుంజయ్‌ ఘోష్‌ గొడవపడ్డారు
  • అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది గొడవను అడ్డుకున్నారు 

 

  • మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • భారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు

     

    ఉదయం 9 గంటల వరకు  పోలింగ్‌ శాతాలు..

     

  • అస్సాం-10.12%
  • బీహార్-10.03%
  • ఛత్తీస్‌గఢ్-13.24%
  • దాద్రా అండ్‌ నగర్ హవేలీ, డామన్ అండ్‌ డయ్యూ- 10.13%
  • గోవా-12.35%
  • గుజరాత్- 9.87%
  • కర్ణాటక-9.45%
  • మధ్యప్రదేశ్-14.22%
  • మహారాష్ట్ర-6.64%
  • ఉత్తరప్రదేశ్-11.63%
  • పశ్చిమ బెంగాల్-14.60%

 

మధ్యప్రదేశ్‌

  • మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు

 

మహారాష్ట్ర

  • ఎన్సిపీ శరద్‌ చంద్ర పవార్‌ చీఫ్‌ శరద్‌ పవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు


 

మహారాష్ట్ర:

  • షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని, ప్రణితి షిండే,  మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు వేశారు.

  • కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఓటు వేశారు.

ఓటు వేసిన ప్రధాని మోదీ

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

  • అహ్మదాబాద్‌లోని నిశాన్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో మోదీ ఓటు చేశారు.

  • బీజేపీ నేత  హరనాథ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఎటా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు

     

  • మధ్య ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు  ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • భోపాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

  • కర్ణాటకలోని కలబురిగి  పోలింగ్‌ కేంద్రంలో  బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్‌ యాదవ్‌ ఓటు వేశారు.

ఓటు వేయాలని ప్రధాని మోదీ  ట్వీట్‌..
‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

 

 లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది

  • ఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు

 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్

  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్
  • 11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు
  • ఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులు
  • గుజరాత్ , మహారాష్ట్ర,  కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలు
  • అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు
  • 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
  • ఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘం
  • మూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలు
  • వడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్   ఏర్పాటుచేసిన ఈసీ
  • ఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23  దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీ
  • పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది.

  •  11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. 

  • ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్‌ పూర్తి కానుంది. 

  • ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.

    బరిలో అగ్రనేతలు, ప్రముఖులు
     

  • కేంద్రమంత్రులు అమిత్‌ షా(గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్‌ మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), ఎస్పీ సింగ్‌ బఘేల్‌(ఆగ్రా)

  • మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(విదిశ), దిగ్విజయ్‌సింగ్‌(రాజ్‌గఢ్‌), ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్

  •  కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    283 చోట్ల పోలింగ్‌ పూర్తి
    ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్‌ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్‌ నిర్వహిస్తు న్నారు. 

  • మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈరోజు పోలింగ్‌ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. 

  • కర్ణాటకలో ఈరోజు పోలింగ్‌ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేసింది. 

  • మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్‌ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. 

  • నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 

  • అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్‌ 4న చేపడతారు.

    రాష్ట్రం               సీట్లు
    గుజరాత్‌           25
    కర్ణాటక             14
    మహారాష్ట్ర          11
    ఉత్తరప్రదేశ్‌         10
    మధ్యప్రదేశ్‌          9
    ఛత్తీస్‌గఢ్‌            7
    బిహార్‌                5
    అస్సాం               4
    బెంగాల్‌              4
    గోవా                  2
    దాద్రానగర్, హవేలీ, 
    డయ్యూడామన్‌        2 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement