Mandya lok sabha
-
Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మాండ్య లోక్‌సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడివిట్లో తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచారు. తమకు రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుమారస్వామికి రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా ఆయన భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయి. తమ ఉమ్మడి కుటుంబంలో తన పేరిట మరో రూ.8.17 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి వెల్లడించారు. -
పార్లమెంట్లో ఫస్ట్‌డే
అందరికీ స్కూల్, కాలేజీ, ఆఫీస్... ఇలా అన్నింటికీ ఫస్ట్‌డే గుర్తుండే ఉంటుంది. చిన్న టెన్షన్, చాలా ఉత్సాహంతో మొదటిరోజు గడుస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్లో తొలిసారి అడుగుపెడుతున్నారు నటి సుమలత. ఎంపీగా తొలిరోజును జ్ఞాపకంగా ఓ ఫొటో తీసుకొని ‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో మొదటిరోజు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ అవకాశాన్ని అదృష్ణంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారామె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతం నుంచి సుమలత ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. -
'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా'
శ్రీకాళహస్తి : రానున్న ఎన్నికల్లో జేడీ (ఎస్) అభ్యర్థిగా బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని సినీనటి రక్షిత తెలిపారు. ఆమె గురువారం కుటుంబ సభ్యలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రక్షిత ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో రక్షిత విలేకర్లతో మాట్లాడుతూ వివాహానంతరం సినిమాల్లో నటించడం లేదన్నారు. అయితే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేస్తానని రక్షిత స్పష్టం చేశారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని ఆమె గత కొంతకాలంగా బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. కాగా మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో శాండిల్ ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు. అలాగే రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. -
మాండ్యలో శాండిల్ వార్
*అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం * పోటీలో రక్షిత, రమ్య, ఉపేంద్ర బెంగళూరు : మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ ఈమెకు స్వయాన బంధువు. అంతేకాకుండా రమ్యకు అటు అధిష్టాన ంతో పాటు ఇటు రాష్ట్ర నాయకులైన అంబరీష్‌తో సహా పలువురు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘యువ మంత్ర’ పఠిస్తుండటంతో మూడు పదులు కూడా దాటని రమ్యకు కలసివచ్చే అవకాశం. దీంతో రాబోయే మండ్యలో సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బరిలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక జేడీఎస్ తరఫున టికెట్టును శాండిల్‌వుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా పేరు సంపాదించుకున్న రక్షిత ప్రేమ్ ఆశిస్తున్నారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని నటి రక్షిత బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. రమ్య స్టార్‌డమ్‌ను అడ్డుకోవడానికి మరోస్టార్‌ను ఎన్నికల బరిలో దించాలనే ఫార్ములాను జేడీఎస్ నాయకులు అనుసరించాలనుకుంటే రక్షితకే పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది. శాండిల్‌వుడ్ రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీ కూడా మండ్య పార్లమెంటును ఎగురేసుకుపోవడానికి ‘స్టార్’ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు స్టార్లనే ఎన్నికల బరిలోకి దించితే వీరికి చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్రకు మండ్య పార్లమెంటు టికెట్టు కేటాయించే అవకాశం కన్పిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మండ్యపై దృష్టి పెట్టాయి. -
నటి రమ్యపై జేడీఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఆమెకు తండ్రి ఎవరో తెలీదు మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి రమ్యపై జేడీఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ వ్యక్తిగత దూషణలకు పాల్ప డి వివాదం రాజేశారు. ‘‘నటి రమ్యకు ప్రజా, రైతు సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లాలో ఎన్ని చక్కెర కర్మాగారాలున్నాయో ఆమెకు తెలుసా? అసలు ఆమె తండ్రి ఎవరో.. ఏ సామాజిక వర్గానికి చెందినదో ఆమెకే తెలియదు. ఏ ప్రాంతానికి చెందినదో కూడా తెలియదు. అలాంటి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కావడం సిగ్గుచేటు’’ అని శ్రీరంగపట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. శ్రీనివాస్ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమేనని కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ మండిపడ్డారు.