'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా' | Ready to contest from Mandya: actress Rakshitha | Sakshi
Sakshi News home page

'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా'

Published Fri, Feb 7 2014 8:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా'

'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా'

శ్రీకాళహస్తి : రానున్న ఎన్నికల్లో జేడీ (ఎస్) అభ్యర్థిగా బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని సినీనటి రక్షిత తెలిపారు. ఆమె గురువారం కుటుంబ సభ్యలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రక్షిత ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో రక్షిత విలేకర్లతో మాట్లాడుతూ వివాహానంతరం సినిమాల్లో నటించడం లేదన్నారు.

అయితే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్కు పోటీ చేస్తానని రక్షిత స్పష్టం చేశారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని ఆమె గత కొంతకాలంగా బహిరంగంగానే చెబుతూ ఉన్నారు.

కాగా మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో శాండిల్ ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు. అలాగే  రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement