
కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra).. డిఫరెంట్ సినిమాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. ఏ, ఉపేంద్ర లాంటి విచిత్రమైన సినిమాలతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపేంద్రకు సీక్వెల్‌గా ఉప్పి 2 కూడా తీశారు. హీరోగా, దర్శకరచయితగా ఈయన తెరకెక్కించిన చివరి చిత్రం యూఐ. గతేడాది రిలీజైన ఈ సినిమా చాలామందికి అసలు అర్థమే కాలేదు. దీంతో ఎంత ప్రమోషన్స్ చేసినా చివరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
ఐదారేళ్లయ్యాక అర్థమవుతుంది
ఈయన ప్రస్తుతం శివరాజ్ కుమార్‌తో కలిసి 45 మూవీలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో యూఐ సినిమా రిజల్ట్ గురించి స్పందించారు. యూఐ సినిమా అర్థమవడం చాలా కష్టమని నాకు తెలుసు. నేను ఏడేళ్ల నుంచి చెప్తున్న విషయాన్నే ఈ మూవీలో స్ట్రాంగ్‌గా చెప్పాను. ఇంకో ఐదారేళ్లు అయ్యాక మీకు సినిమా అర్థమవుతుంది. నేను చేసిన ప్రయోగం ఏంటంటే.. థియేటర్‌లో సినిమా చూసేవాళ్లే అసలైన విలన్లు.
అర్థం అయినా కానట్లే..
దాన్ని మీరు జీర్ణించుకోవడం కష్టం. మీరెప్పుడూ స్క్రీన్‌పై కనిపించే విలన్‌నే చూస్తారు కదా.. కానీ యూఐ సినిమాలో ఉండే విలన్ మీరే. సినిమా చూస్తున్నప్పుడు ఆ విలన్ మీరే అని తెలుస్తుంది. అందుకే అంతా అర్థమయినా కూడా ఏమీ అర్థం కానట్లు నటిస్తారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడలో బుద్ధివంత 2, త్రిశూలం, 45 సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న కూలీలోనూ యాక్ట్ చేస్తున్నారు.
చదవండి: దేవి శ్రీప్రసాద్‌కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!