
కన్నడ స్టార్ యశ్ (Yash), నటి దీపికా దాస్ దగ్గరి బంధువులు. వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లవుతారు. కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు పెద్దగా మాట్లాడుకోరు, కలిసి కనిపించరు. దీంతో వీరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అన్న రూమర్లు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది దీపిక. దీపికా దాస్ (Deepika Das) ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం పారు పార్వతి. ఈ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
యష్‌తో విభేదాలు
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె యశ్‌తో విభేదాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించింది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము బాగానే ఉన్నాం. కాకపోతే వృత్తిపరంగా ఎవరి కెరీర్‌ను వారే నిర్మించుకోవాలనుకున్నాం. సినిమాలను మా మధ్యలోకి రానివ్వం. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. పదేపదే మా బంధాన్ని పబ్లిక్‌లో చెప్పాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం.

గోప్యతకే ప్రాధానం
అలాగే నేనేదైనా మంచిపని చేస్తే యశ్ నన్ను అభినందిస్తాడు. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం మాకు నచ్చదు. పాజిటివ్, నెగెటివ్ ఏదైనా కానీ చిన్న వార్త దేశమంతా చుట్టేస్తోంది. అందుకే మా వ్యక్తిగత జీవితాలను గోప్యంగానే ఉంచుకుంటాం, అందరికీ చెప్పాలనుకోం. మా కుటుంబాలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తాయి. అందువల్ల ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే మేము కలుసుకుంటూ ఉంటాం.
సంతోషంగా ఉంది
యశ్ కన్నడ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అతడు కొనసాగుతున్న కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Sandalwood)లో నేనూ ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అతడు మున్ముందు సాండల్‌వుడ్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్నాడు.
చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా
Comments
Please login to add a commentAdd a comment