కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఉపేంద్ర చెప్పినట్లుగానే ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రారంభంలో కొన్ని చిత్రవిచిత్ర డైలాగులు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అందులో.. 'తెలివైనవాళ్లు తెలివితక్కువవాళ్లుగానే కనిపిస్తారు. కానీ తెలివి లేనివాళ్లు మాత్రం పైకి తెలివైనవాళ్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు' అన్న డైలాగ్ కూడా ఉంది.
ఇప్పుడిది అవసరమా?
దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థియేటర్‌లో సినిమా వీక్షించిన ఏ ఒక్కరూ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఇప్పుడిది అవసరమా సర్? మీ సినిమా అందరి కంట్లో పడింది. అందుకు సంతోషించండి అని కామెంట్ చేశాడు. మరికొందరేమో.. 'మేము అంత ఇంటెలిజెంట్ కాదు సర్..', 'అసలు యూఐ సినిమాను థియేటర్‌లో చూడనివారు నిజమైన మేధావులు..', 'అక్కడ కనిపిస్తున్న డైలాగ్‌లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అబ్బో.. ఇలాంటి డైలాగులకు కొదవే లేదు
యూఐ సినిమాలో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. నువ్వు మేధావివైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపో.. తెలివితక్కువవాడితైనే సినిమా అంతా చూడు.. వంటి వింత కొటేషన్లు దర్శనమిస్తాయి. రేష్మ నానయ్య, సన్నీలియోన్, జిష్షు సేన్‌గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
Why is no one talking about this that was seen on screen ? ! pic.twitter.com/ZzrOJJsuUK
— Upendra (@nimmaupendra) December 23, 2024
చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment