కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది.
టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment