UI
-
ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే.. జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
దీని గురించి ఎవరూ మాట్లాడరేంటి?: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఉపేంద్ర చెప్పినట్లుగానే ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రారంభంలో కొన్ని చిత్రవిచిత్ర డైలాగులు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అందులో.. 'తెలివైనవాళ్లు తెలివితక్కువవాళ్లుగానే కనిపిస్తారు. కానీ తెలివి లేనివాళ్లు మాత్రం పైకి తెలివైనవాళ్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు' అన్న డైలాగ్ కూడా ఉంది.ఇప్పుడిది అవసరమా?దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థియేటర్లో సినిమా వీక్షించిన ఏ ఒక్కరూ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఇప్పుడిది అవసరమా సర్? మీ సినిమా అందరి కంట్లో పడింది. అందుకు సంతోషించండి అని కామెంట్ చేశాడు. మరికొందరేమో.. 'మేము అంత ఇంటెలిజెంట్ కాదు సర్..', 'అసలు యూఐ సినిమాను థియేటర్లో చూడనివారు నిజమైన మేధావులు..', 'అక్కడ కనిపిస్తున్న డైలాగ్‌లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అబ్బో.. ఇలాంటి డైలాగులకు కొదవే లేదుయూఐ సినిమాలో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. నువ్వు మేధావివైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపో.. తెలివితక్కువవాడితైనే సినిమా అంతా చూడు.. వంటి వింత కొటేషన్లు దర్శనమిస్తాయి. రేష్మ నానయ్య, సన్నీలియోన్, జిష్షు సేన్‌గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Why is no one talking about this that was seen on screen ? ! pic.twitter.com/ZzrOJJsuUK— Upendra (@nimmaupendra) December 23, 2024 చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
ప్రపంచాన్నే టాలీవుడ్ షేక్ చేస్తోంది: ఉపేంద్ర
‘‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకుని, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ,ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతోంది. ఈ గొప్పదనం అంతా తెలుగు ప్రేక్షకులదే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండియానే కాదు... ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. వెయ్యి కోట్లు, రెండువేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు.ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘యూఐ’ రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది. ఆడియన్స్ ఓ కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు (ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ..) మైథలాజికల్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చూశారు.కానీ ‘యూఐ’ సినిమా సైకలాజికల్ కల్కి. ‘యూఐ’ సినిమాలోని అంశాలను ఆడియన్స్ డీకోడ్ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను. కేపీ శ్రీకాంత్‌గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు, ఆయన లహరిలాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు. ఇక ‘యూఐ’ సినిమాను అల్లు అరవింద్‌గారు తెలుగులో రిలీజ్ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు రేష్మ. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు ఎస్కేఎన్, అంబికా రామచంద్రరావు, ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ తులíసీ రామ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ చంద్రు మనోహరన్, కోప్రోడ్యూసర్ నవీన్ మనోహరన్, డైలాగ్ రైటర్ పార్థసారథి, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల మాట్లాడి, ‘యూఐ’ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. -
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది: ఉపేంద్ర
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు. -
సందేశాలు ఇవ్వను... తీసుకోను: ఉపేంద్ర
‘‘ఆడియన్స్ వినోదం కోసం థియేటర్స్‌కు వస్తారు. వారిని అలరించే అన్ని కమర్షియల్ హంగులు ‘యూఐ’ సినిమాలో ఉన్నాయి. నార్మల్‌గా చూసినప్పుడు ‘యూఐ’ ఓ సినిమాగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే కథలో మరో లేయర్ కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్‌గా వెళితే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో అన్నీ కొత్తగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నా దృష్టిలో ప్రేక్షకులే సూపర్ స్టార్స్. ఈ విషయాన్ని నా తొలి సినిమాతోనే గ్రహించాను. వాళ్లు ఫిల్మ్‌మేకర్స్ కంటే పైనే ఉంటారు’’ అని ఉపేంద్ర అన్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంటాను.ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక ఫూల్ వెళ్తాడనేది సామెత. బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో(నవ్వుతూ). అయితే నేను ఫీలయ్యే కథనే ఆడియన్స్ కూడా ఫీలవుతున్నారనుకుని, కొందరితో చర్చించి, ‘యూఐ’ సినిమా తీశాను. ‘యూఐ’ అంటే ఏమిటో థియేటర్స్‌లో చూడండి. ‘యూఐ’ వార్నర్ అంటూ వచ్చిన ఈ సినిమా వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోని కాంప్లెక్స్ తరహా విజువల్స్ కనిపించాయంటున్నారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మైథలాజికల్. ‘యూఐ’ మూవీ సైకలాజికల్. ఒక సినిమాతో మరొక దానికి సంబంధం లేదు.‘యూఐ’కిపార్టు 2 లేదు. ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్. టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఇప్పుడున్న టెక్నాలజీతో రూమ్‌లోనే సినిమా తీయొచ్చు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నేను ఏం మార్చలేను. నన్ను నేనే మార్చుకోలేకపోతున్నాను. అందుకే సందేశాలు ఇవ్వను. తీసుకోను. సినిమా అంటే వ్యాపారమే. సినిమా సక్సెస్ వేరు... పొలిటికల్ సక్సెస్ వేరు’’ అని అన్నారు.అల్లు అర్జున్ మంచి పెర్ఫార్మర్. ఆయనకు నేను ఫ్యాన్. త్రివిక్రమ్ అంటే కూడా ఇష్టమే. వారి కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో నటించడం హ్యాపీ. ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే తెలుగులో చేయలేకపోయాను. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.. ఆయన బయటకు వచ్చారు. సమస్య లేదు.రజనీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నిజమైనట్లుగా ఉంది. దాదాపుపాతిక సంవత్సరాల క్రితం రజనీకాంత్‌గారిని కలిశాను. ఆయన అప్పుడు నాకు చెప్పిన విషయాల అర్థం ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేద్దాం
కంటోన్మెంట్: వైట్ కాలర్ నేరాల అదుపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నార్త్‌జోన్ డీసీపీ సుమతి పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ పరిధిలోని అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసుల రివ్యూ నిమిత్తం శనివారం సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో నార్త్‌జోన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వైట్ కాలర్ నేరాలు తగ్గడం లేదన్నారు. ముఖ్యంగా చిలకలగూడ, మార్కెట్ పరిధిలో అధికంగా నమోదవుతున్న వైట్ కాలర్ నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత ఏసీపీలు గంగాధర్, శ్రీనివాసరావులను ఆదేశించారు. ఈ మేరకు త్వరలో విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని సూచించారు. ఇక జోన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న నేరాలకు సంబంధించి వీలైనంత త్వరగా చార్జ్షీట్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జనవరి నెలలో నమోదైన 345 కేసులకు గానూ 26కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై కూడా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట, మహంకాళి, గోపాలపురం ఏసీపీలు, వివిధ పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.