‘‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకుని, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ,ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతోంది. ఈ గొప్పదనం అంతా తెలుగు ప్రేక్షకులదే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండియానే కాదు... ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. వెయ్యి కోట్లు, రెండువేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు.
ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘యూఐ’ రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది. ఆడియన్స్ ఓ కొత్త సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీరు (ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ..) మైథలాజికల్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చూశారు.
కానీ ‘యూఐ’ సినిమా సైకలాజికల్ కల్కి. ‘యూఐ’ సినిమాలోని అంశాలను ఆడియన్స్ డీకోడ్ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను. కేపీ శ్రీకాంత్‌గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు, ఆయన లహరిలాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు. ఇక ‘యూఐ’ సినిమాను అల్లు అరవింద్‌గారు తెలుగులో రిలీజ్ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు రేష్మ.
ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు ఎస్‌కేఎన్, అంబికా రామచంద్రరావు, ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ తులíసీ రామ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ చంద్రు మనోహరన్, కోప్రోడ్యూసర్ నవీన్ మనోహరన్, డైలాగ్ రైటర్ పార్థసారథి, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల మాట్లాడి, ‘యూఐ’ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment