బుల్లితెర నటి కూతురి అన్నప్రాసన వేడుక.. సోషల్ మీడియాలో వైరల్! | TV actress Malavika Krishnadas Daughter anna prasana ceremony | Sakshi
Sakshi News home page

Malavika Krishnadas: బుల్లితెర నటి మాళవిక కుమార్తె అన్నప్రాసన వేడుక.. సోషల్ మీడియాలో వైరల్!

Published Tue, Mar 25 2025 7:15 PM | Last Updated on Tue, Mar 25 2025 7:50 PM

TV actress  Malavika Krishnadas Daughter anna prasana ceremony

ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్‌ గతేడాది నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బుల్లితెర నటుడు తేజస్‌ను 2023లో పెళ్లాడిన నటి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. గత నవంబర్‌లో పండంటి పాపకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ.. తన కూతురికి రుత్వి తేజస్‌గా నామకరణం చేసింది. అయితే తాజాగా తన కూతురి అన్నప్రాసన వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా.. టీవీ సీరియల్స్‌,  టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా మలయాళ కుట్టి మాళవిక  కృష్ణదాస్ ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా మాళవిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.  ఆ తర్వాత మాళవిక కృష్ణదాస్,  తేజస్ జ్యోతి  ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ ‍అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement