krishnadas
-
బుల్లితెర నటి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?
-
అది తప్పుడు ప్రచారం..‘చిన్మయ్’కి అండంగా ఉంటాం: ఇస్కాన్
ఢాకా:బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిన్మయ్ అరెస్టుతో సంబంధం లేదని తాము ప్రకటించినట్లు వస్తున్న వార్తలను ఇస్కాన్ తాజాగా ఖండించింది. చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కులను కాపాడడానికి ఇస్కాన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేసింది.హిందువులను,వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనిన ఇస్కాన్ తెలిపింది. చిన్మయ్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ డిమాండ్ చేసింది.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు కల్పిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. తమ సంస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ఈ ప్రచారాలు చేస్తున్నట్లుందని సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ తెలిపారు. కాగా,చిన్మయ్ కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని బాధ్యతల నుంచి అతడిని తొలగించామని ఆయన చేసే నిరసనలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చారు చంద్రదాస్ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా అక్టోబర్‌లో చిట్టగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ జాతీయజెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించాలని ఓ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది.ఇదీ చదవండి: ‘చిన్మయ్’ అరెస్టుపై స్పందించిన షేక్‌హసీనా -
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
ఆనందమానందమాయె..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పరిపాలనలో పారదర్శకత, నమ్మినవారికి సముచిత స్థానం, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం, పార్టీ ఆవిర్భావం నుంచి అందించిన సేవలు... ఇలా అన్ని అంశాల్లో నెగ్గుకొచ్చినవారికి తగిన గుర్తింపు లభించింది. అఖండ విజయంతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత పదవుల ఎంపికలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తన మంత్రివర్గంలో సీనియరు నాయకుడు, నరసన్నపేట ఎమ్మెల్యేధర్మాన కృష్ణదాస్‌కు చోటుకల్పించనున్నారు. శుక్రవారం శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం గవర్నరు ఎన్.నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అలాగే జిల్లాలో మరో సీనియరు నాయకుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకరుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాలో రెండు ప్రధా న సామాజికవర్గాలకు చెందిన సీనియరు నాయకులకు ఉన్నత పదవులు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో ఆనందం వ్యక్తమవుతోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి మిగతా సామాజిక వర్గాల నాయకులకు న్యాయం చేస్తానని జననేత జగన్ ముందుగానే స్పష్టం చేశారు. ఈ ప్రకారం జిల్లాలో మరికొందరు నాయకులకు ఆ సందర్భంలో మంత్రిమండలిలో స్థానం లభించే అవకాశం ఉంది. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు సోదరుల్లో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి, నల్లారు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. ప్రస్తుతం జిల్లా నుంచి ఒకే ఒక్కరికి అవకాశం ఇస్తున్న దృష్ట్యా కేబినెట్లో కీలకమైన శాఖ లభించొచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. కృష్ణదాస్ 2004, 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నరసన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక చని పోయినవారి కుటుంబాలను ఓదార్చేందుకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి జగన్మోహన్రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటుచేసినప్పుడు జిల్లా నుంచి కృష్ణదాస్ ఆయన బాటలో నడిచారు. తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. 2012 ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అలాగే పార్టీలో, బీసీ సంఘంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి ఎన్నికలలోనూ భారీ మెజార్టీతో నరసన్నపేట నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచి వాగ్ధాటి, సమయస్ఫూర్తి ఉన్న నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆమదాలవలస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఆయనకు శాసనసభాధిపతిగా అవకాశం లభించింది. సీనియరు నాయకుడిగా అసెంబ్లీని సమర్థంగా నడిపించగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనకు ఉన్నతమైన పదవి లభించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా నుంచి తమ్మినేనినే ఆ పదవి వరించింది. మంత్రి పీఠంపై దాసన్న వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు.. ఎమ్మెల్యే పదవిని త్యజించి నాయకుడి వెంట నడిచారు.. ప్రజల అండదండలతో ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు.. గత తొమ్మిదేళ్లుగా దాసన్న ఎదుర్కొన్న ఒడిదొడుకులకు, అలుపెరుగని పోరాటానికి గుర్తింపుగా ఇప్పుడు మంత్రి పదవి లభించింది. అంకిత భావానికి, నిష్కల్మషమైన ఆయన మనసుకు అధినేత నుంచి లభించిన అరుదైన బహుమతి ఇది. అధ్యక్షా.. అభినందనలు అనుభవానికి తగిన గుర్తింపు.. పదేళ్లుగా పార్టీకి అందించిన సేవలకు ప్రతిఫలం.. ఆరుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవి వరించిన వేళ సర్వత్రా అభినందనలు.. న్యాయశాస్త్ర పట్టభద్రుడు కావడం, ఎన్నో ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేనికి కలిసివచ్చింది. సీతారాం, కృష్ణదాస్‌కు అభినందనలు కాశీబుగ్గ, కంచిలి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్‌కు మంత్రి పదవి, ఆమదాలవలస ఎమ్మెల్యే సీతారాంకు అసెంబ్లీ స్పీకర్ పదవులు వరించాయి. తమపై నమ్మకంతో పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు వారిని అభినందించారు. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు పేరాడ తిలక్, పిరియా సా యిరాజ్లతోపాటు టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల నాయకులు అమరావతిలో వా రిని కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ప్ర జల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణదాస్ ప్రస్థానం ఇలా... జననం: 1954 జూలై 7 తల్లిదండ్రులు: ధర్మాన రామలింగం నాయుడు, సావిత్రమ్మ స్వస్థలం: నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి మండలంలోని మబగాం విద్య: బీకాం భార్య: ధర్మాన పద్మప్రియ (సారవకోట మండలం జడ్పీటీసీ సభ్యురాలు) పిల్లలు: ధర్మాన రామలింగం నాయుడు (బీటెక్), డాక్టరు ధర్మాన కృష్ణచైతన్య (ఎండీ రేడియాలజీ) ఉద్యోగం: విశాఖపట్నం స్టీలుప్లాంటులో పనిచేశారు. రాజకీయం: నరసన్నపేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2012లో వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదుచేశారు. 2019లో నాలుగోసారి గెలుపొందారు. తమ్మినేని రాజకీయ ప్రస్థానం... జననం: 1955 తల్లిదండ్రులు: తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందువతమ్మ స్వస్థలం: ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం విద్య: డిగ్రీ భార్య: వాణిశ్రీ పిల్లలు: నాగినీ విజయలక్ష్మి, చిరంజీవినాగ్ (వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) రాజకీయం: 1980లో ఆమదాలవలస చక్కెర కర్మాగారం డైరెక్టరుగా ఎన్నికై తమ్మినేని రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983 నుంచి వరుసగా ఆరుసార్లు (1983, 1985, 1991, 1994, 1999, 2019) ఆమదాలవలస ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా, పలు కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. -
అచ్చెన్నా.. ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకో..
నీకు సత్తావుంటే వచ్చేఎన్నికల్లో నాపై పోటీచెయ్ నన్ను విమర్శించే వ్యక్తిత్వం నీది కాదు, నీకు లేదు మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై ధర్మాన కృష్ణదాస్ ధ్వజం ప్రియాగ్రహారం(పోలాకి): మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరప్రగల్భాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు. ప్రియాగ్రహారంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ధర్మాన సోదరులపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన గౌరవమైన, బాధ్యతాయుతమైన పదవికి విలువ ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మంత్రికి సత్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తను ఓడిపోతే శాశ్వితంగా రాజకీయాలకు దూరంగా ఉంటాననని, మంత్రి కూడా పత్రికాముఖంగా సవాల్‌ను స్వీకరించాలన్నారు. గతంలో స్వర్గీయ యర్రన్నాయుడు... కిల్ల కృపారాణి చేతిలో, అచ్చెన్నాయుడు... కొర్ల భారతి చేతిలో ఓటమిపాలైన విషయాన్ని మంత్రి అయిన మరుచటి రోజే మరచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. నరసన్నపేట నియోజక వర్గంలో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని వెనకేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు పనికిమాలిన మాటలకు దూరంగా ఉండాలన్నారు. గవర్నర్‌నే గంగిరెద్దుతో పోల్చిన మంత్రి అచ్చెన్నకు నన్ను విమర్శించే వ్యక్తిత్వం లేదని గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి నరసన్నపేట నియోజకవర్గంలో నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీలు కరిమి రాజేశ్వరరావు, దుంపల భాస్కరరావు, పార్టీ నాయకులు బెవర నూకరాజు తదితరులు ఉన్నారు. -
నేటి ఉదయం నుంచి రహదారుల బంద్
శ్రీకాకుళం, శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న నినాదంతో నిరంతర పోరాటం సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కార్యాచరణకు ఉద్యుక్తమైంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా 48 గం టలపాటు రహదారుల దిగ్బంధానికి సిద్ధమైంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రహదారులను బంద్ చేసేందుకు పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. సమైక్యవాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునివ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో, విద్యార్థి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వర్గాల నుంచి ఈ కార్యక్రమాలనికి స్పం దన కనిపిస్తోంది. దిగ్బంధన కార్యక్రమంపై మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశమై చర్చించి, కార్యాచరణను సిద్ధం చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి సాగుతున్న ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో ఆయా ప్రాంతాల నాయకులు బాధ్యత తీసుకుని రాకపోకలను స్తంభింపజేస్తారు. పాలకొండ, రాజాం, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు తమ పరిధిలోని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తారు. ఇందులో భాగంగా పలు చోట్ల రహదారులపై వంటావార్పు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. సమైక్యవాదులందరూ పాల్గొనాలి : కృష్ణదాస్ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీల పరంగా సమైక్యాంధ్ర కోసం ఒక్క వైఎస్ఆర్ సీపీయే పోరాటం చేస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్దేశంచిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా బుధ, గురువారాల్లో ప్రధాన రహదారులను దిగ్భంధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. వారిని భాగస్వాములను చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ సమన్వయకర్తలతో ఈ కార్యక్రమంపై చర్చించారు. సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, పీఎంజే బాబు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణలతోపాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు మార్పు ధర్మారావు, పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జి.టి.నాయుడు, పార్టీ జిల్లా ఆడహక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ప్రధాన రాజేంద్ర, కరిమి రాజేశ్వరరావు, తంగి శివప్రసాద్, మహమ్మద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.