
ఇటీవలే ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు. తాజాగా తన ముద్దుల కూతురికి 28 రోజుల వేడుక నిర్వహించారు. తన బిడ్డకు రుత్వి తేజుస్‌గా నామకరణం చేశారు బుల్లితెర దంపతులు.

తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.

బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.

బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు.

కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మాళవిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.

వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.

ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.