
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు.
టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్‌ఆర్డర్ కంట్రోల్‌లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.
చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.

ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు
Comments
Please login to add a commentAdd a comment