
ప్రముఖ నటుడు జయరాం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జయరాం- పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. పాలక్కడ్‌కు చెందిన నవనీత్ గిరీశ్‌తో ఏడడుగులు వేసింది. శుక్రవారం నాడు కేరళలోని గురువాయూర్ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా ఇతర రాజకీయ, సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరుడు నవనీత్ గిరీశ్ విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూకేలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

మాళవిక విషయానికి వస్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. మాళవిక- నవనీత్‌ల ఎంగేజ్‌మెంట్ కర్ణాటకలోని మడికెరిలో గతేడాది డిసెంబర్‌లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment