‘‘ఆడియన్స్ వినోదం కోసం థియేటర్స్‌కు వస్తారు. వారిని అలరించే అన్ని కమర్షియల్ హంగులు ‘యూఐ’ సినిమాలో ఉన్నాయి. నార్మల్‌గా చూసినప్పుడు ‘యూఐ’ ఓ సినిమాగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే కథలో మరో లేయర్ కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్‌గా వెళితే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో అన్నీ కొత్తగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఎందుకంటే నా దృష్టిలో ప్రేక్షకులే సూపర్ స్టార్స్. ఈ విషయాన్ని నా తొలి సినిమాతోనే గ్రహించాను. వాళ్లు ఫిల్మ్‌మేకర్స్ కంటే పైనే ఉంటారు’’ అని ఉపేంద్ర అన్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంటాను.
ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక ఫూల్ వెళ్తాడనేది సామెత. బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో(నవ్వుతూ). అయితే నేను ఫీలయ్యే కథనే ఆడియన్స్ కూడా ఫీలవుతున్నారనుకుని, కొందరితో చర్చించి, ‘యూఐ’ సినిమా తీశాను. ‘యూఐ’ అంటే ఏమిటో థియేటర్స్‌లో చూడండి. ‘యూఐ’ వార్నర్ అంటూ వచ్చిన ఈ సినిమా వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోని కాంప్లెక్స్ తరహా విజువల్స్ కనిపించాయంటున్నారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మైథలాజికల్. ‘యూఐ’ మూవీ సైకలాజికల్. ఒక సినిమాతో మరొక దానికి సంబంధం లేదు.
‘యూఐ’కిపార్టు 2 లేదు. ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్. టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఇప్పుడున్న టెక్నాలజీతో రూమ్‌లోనే సినిమా తీయొచ్చు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నేను ఏం మార్చలేను. నన్ను నేనే మార్చుకోలేకపోతున్నాను. అందుకే సందేశాలు ఇవ్వను. తీసుకోను. సినిమా అంటే వ్యాపారమే. సినిమా సక్సెస్ వేరు... పొలిటికల్ సక్సెస్ వేరు’’ అని అన్నారు.
అల్లు అర్జున్ మంచి పెర్ఫార్మర్. ఆయనకు నేను ఫ్యాన్. త్రివిక్రమ్ అంటే కూడా ఇష్టమే. వారి కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో నటించడం హ్యాపీ. ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే తెలుగులో చేయలేకపోయాను. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.. ఆయన బయటకు వచ్చారు. సమస్య లేదు.
రజనీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నిజమైనట్లుగా ఉంది. దాదాపుపాతిక సంవత్సరాల క్రితం రజనీకాంత్‌గారిని కలిశాను. ఆయన అప్పుడు నాకు చెప్పిన విషయాల అర్థం ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment