
బంగారం అక్రమరవాణాతో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao). 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో సోమవారం అరెస్ట్ చేశారు. ఆమె డీజీపీ కూతురినని చెప్పడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె రామచంద్రారావు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి అవుతాడు!
మాకేదీ తెలియదు
తాజాగా ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు. నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు తను మమ్మల్ని కలవనేలేదు. తన గురించి కానీ, తన భర్త చేసే బిజినెస్ గురించి మాకేమీ తెలీదు. జరిగిన విషయం తెలిసి మేమంతా షాకయ్యాం.. అలాగే నిరాశచెందాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. ప్రస్తుతం రన్యాను మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు.
ఎవరీ రన్యా?
రన్యా.. కర్ణాటకలోని చిక్కమంగళూరులో జన్మించింది. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో నటనలో మెళకువలు తెలుసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఈమెను దర్శకుడు, హీరో సుదీప్ వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో దర్శన్‌తో కలిసి పని చేయాలనుందని తెలిపింది. తాను మంచి భోజన ప్రియురాలు అని, షాపింగ్ చేయడం అంటే ఇష్టమని పేర్కొంది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.
చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment