కన్నడ సినీ దర్శకుడు రాజేంద్ర బాబు కన్నుమూత!
Published Sun, Nov 3 2013 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, రచయిత డి రాజేంద్ర బాబు ఆదివారం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. 62 సంవత్సరాల రాజేంద్ర బాబు కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
మా నాన్నకు గుండెపోటు రావడంతో వెంటనే రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరకముందే కన్నుమూశారు అని వైద్యులు నిర్ధారించారని రాజేంద్ర బాబు కూతురు నక్షత్ర మీడియాకు తెలిపారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొద్దికాలంగా అస్వస్థతకు గురయ్యారన్నారు.
రాజేంద్ర బాబు 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్ లో పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఆయన కొన్ని తెలుగు, మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. 1987లో గోవిందా, మందాకిని నటించిన ప్యార్ కర్కే దేఖో అనే హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
నాను నన్న హెందతి, ఒలవినా ఉదుగోరే, రామాచారి, రామరాజ్యదల్లి రక్షసరు, హలుందా తవరు, అప్పాజీ, దిగ్గజారు, అమ్మ, ఎన్ కౌంటర్ దయానాయక్, బిందాస్ వంటి హిట్ చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు.
రాజేంద్ర బాబు మృతికి కన్నడ నటులు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, లోకసభ సభ్యులు రమ్యతోపాటు పలువురు సంతాపం వెలిబుచ్చారు.
Advertisement