
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (Shivarajkumar)కు సినిమాలపై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకనే.. ఓ పక్క క్యాన్సర్‌తో బాధపడుతున్నా సరే ఇటు షూటింగ్స్ వదల్లేదు. అటు కీమోథెరపీ చేయించుకుంటూనే ఇటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. చికిత్సలో భాగంగా ఇటీవలే అమెరికాలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇంకేం చేయగలను?
నిజాయితీగా చెప్పాలంటే.. నాకు క్యాన్సర్ (Bladder Cancer) సోకిందన్న విషయం తెలియగానే భయపడ్డాను. కానీ దాన్ని ఎదుర్కోవడం తప్ప ఇంకేం చేయగలను? అయితే నేను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయగలనా? లేదా? అన్నదే నా ముందున్న పెద్ద ప్రశ్న! సినిమాలు చేస్తూ డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ అనే రియాలిటీ షోకు హాజరవుతూ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాను. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుందని తెలుసు. దీనివల్ల నా సినిమా లుక్ దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాను.
కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్
చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల త్వరగా అలిసిపోయిన ఫీలింగ్ వచ్చేది. అందులోనూ కీమోథెరపీ తర్వాత సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నా ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఇలా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నప్పుడే 45 సినిమాలో క్లైమాక్స్ షూట్ కూడా పూర్తి చేశాం. అందులో నా పర్ఫామెన్స్ చూసి మీరు కచ్చితంగా షాకవుతారు. శివన్నా ఎలా చేయగలిగాడు? అని ఆశ్చర్యపోతారు. ఇకపోతే ఆ భగవంతుడే నన్ను ఈ క్యాన్సర్ గండం నుంచి గట్టెక్కించాడు.
అప్పటినుంచే తిరిగి షూటింగ్స్‌లో..
మార్చి 3 నుంచి నా తర్వాతి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటాను. రామ్‌చరణ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాను. మార్చి 5న హైదరాబాద్‌లో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌కు హాజరు కానున్నాను అని చెప్పుకొచ్చాడు. శివరాజ్‌కుమార్ చివరగా భైరతి రణగల్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన 45 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ సామ్ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment