rakshita
-
కాలేజీలో చేరిన నాలుగో రోజే వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్‌నగర్ లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని లింగన్ వాడి రక్షిత (15) ఆత్మహత్యకు పాల్ప డటం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత ఆగస్టు 27న వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్టియర్‌లో చేరింది. శనివారం ఉదయం నిద్ర లేచిన ఆమె బాత్ రూమ్‌కు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో తోటి విద్యార్థులు తలుపులు గట్టిగా బాదడంతో కింది భాగం విరిగిపడింది. అందులో నుంచి చూసిన విద్యార్థినులకు రక్షిత చున్నీతో ఉరివేసుకున్న దృశ్యం కన్పించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కేర్ టేకర్, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా వివరాలను సేకరించారు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీలో శుక్రవారం నాటి డాటా లేకపోవడంతో నిపుణులను పిలిపించి తీసుకుంటామని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రావు చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. కాగా, రక్షిత ఆత్మహత్య విషయమై కాలేజీ యాజమాన్యంపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి విష్ణు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమది వ్యవసాయ కుటుంబమని, నలుగురు సంతానంలో రక్షిత రెండో అమ్మాయని, రక్షితకు వ్యవసాయ విద్య అంటే ఎంతో ఇష్టమన్నారు.కాలేజీ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌ను విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.3 -
డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్‌గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్‌న్యూస్ చెప్పిన సీరియల్ జంట -
అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 11 గంటలకు రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శర్వా పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక కోసం లీలా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒక రోజు ముందే ప్యాలెస్‌కు వెళ్లారు. శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకకు రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు. ఇక శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాస్త్రోక్తంగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేశాడు శర్వా. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకుంది ఈ జంట. -
Sharwanand: హీరో శర్వానంద్ హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
కాబోయే భార్యతో ఫస్ట్ పోస్ట్ చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు.. పూరీపై హీరోయిన్ ఫైర్
లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తిరిగి అభిమానులతో టచ్‌లోకి వస్తున్నాడు. పూరీ మ్యూజింగ్స్ పేరిట నిత్యం ఏదో ఒక అంశంపై ఫిలాసఫీ బోధిస్తున్నాడు. తాజాగా ఆయన బ్యాలెన్స్డ్గా రిప్లై ఇవ్వడం ఎలా? అనేది వివరించాడు. అంతేకాకుండా దీనికి ఇడియట్ మూవీ షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. 'జీవితంలో చాలా జరుగుతుంటాయి. వాటిమీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే మన చేతుల్లో ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కామ్‌గా రియాక్ట్ అవాలి. అరిచి గోల చేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేయకూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. ఆ సమస్యకు మీరు స్పందించే విధానమే అసలైన సమస్య. మనుషులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? లేదా ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానమిస్తున్నామన్నది ముఖ్యం. బ్యాలెన్సెడ్‌గా, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకుని మాట్లాడాలి. విపరీతమైన కోపంలో ఉంటే అస్సలు ఆన్సర్ చేయకండి, సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలాసార్లు ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం చాలా మంచిది. అవతలి మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ రియాక్ట్ అవండి, వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. ఇడియట్ సినిమా షూటింగ్లో ఏడ్చే సన్నివేశంలో రక్షిత విపరీతంగా పగలబడి నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. సెట్లో అందరూ వింటుండగా చాలా గట్టిగా చెప్పా.. రక్షిత నువ్వు ఫోకస్ చేయట్లేదు, ఇలాగైతే నెక్స్ట్ సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను అని చెప్పాను. ఆమె వెంటనే రాయాలి, రాయకపోతే చంపేస్తా! నీ తర్వాతి 10 సినిమాలు నేనే చేస్తా.. ఇప్పుడు నీకేం కావాలో సరిగా చెప్పి చావు అంది. అంతే, ఆమె రెస్పాన్స్‌కు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ మాటలకు నాకూ నవ్వాగలేదు. ఎందుకంటే ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ అది. దెబ్బతో ఆమె మీద కోపం పోయింది. అలా కాకుండా నేనన్న మాటలకు ఇన్సల్ట్గా ఫీలై ఏడుస్తూ సెట్లో నుంచి వెళ్లిపోవచ్చు. అలిగి రెండో రోజు షూటింగ్‌కు రావడం మానేయొచ్చు.. కానీ తనలా చేయలేదు. అందుకే మన రియాక్షన్స్‌తో జీవితంలో చాలా నాన్సెన్స్ను కట్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ పెడితే ప్రత్యేకంగా రియాక్ట్ కానవసరం లేదు. ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్‌గా రియాక్ట్ అయి పదిమందితో వాదించి గొడవపెట్టుకోవడం అవసరమా? కాబట్టి మనకు పనికొచ్చేవాటికే మనం రియాక్ట్ కావాలి. నవ్వుతూ సమాధానం చెప్పండి. లేదంటే ఎలాంటి బదులివ్వకుండా చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు' అని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్. చదవండి: మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు శ్రీసత్య బలి పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'ఇడియట్' హీరోయిన్!
అలనాటి అందాల హీరోయిన్ రక్షిత గుర్తుండే ఉంటుంది. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ రవితేజ, గిచ్చి గిచ్చి చంపుతోంది గ్రీకు సుందరి, చూపుతోటే వైరసేదో పంపుతున్నది అంటూ ఎన్టీఆర్.. వీళ్లిద్దరేనా! మహేశ్‌బాబు, నాగార్జున వంటి బడా హీరోలు కూడా ఆమెతో ఆడిపాడారు. తెలుగు, కన్నడ సినిమాలను సమంగా బ్యాలెన్స్ చేసిన రెండు చోట్లా ఓ వెలుగు వెలిగిన ఈ తార ప్రస్తుతం ఏం చేస్తుందో చదివయేండి.. రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగింది బెంగళూరులో. ఆమె తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆమె సినిమా ఎంట్రీ సులువైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో నత చదువుకు ఫుల్స్టాప్ పెట్టేసి 2002లో అప్పుతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమానే బంపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అప్పుకు రీమేక్‌గా తెరకెక్కిన ఇడియట్(తెలుగు), దమ్(తమిళం) సినిమాల్లోనూ రక్షిత హీరోయిన్గా మెరిసింది. ఆమె నటనను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. కన్నడలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతూనే తెలుగులోనూ నాగార్జునతో శివమణి, మహేశ్‌బాబుతో నిజం, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, జగపతిబాబుతో జగపతి సినిమాల్లో జోడీ కట్టింది. దీంతో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకుంది. అలా కెరీర్ ఓ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించిన ఆమె ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు కన్నడ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఏక్ లవ్ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో గెస్ట్ పాత్ర ద్వారా కెమెరా ముందు నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్: ఈ సినిమాలు చూశారా? తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష, చేతికి రింగు కూడా ఉందే! -
ఘనంగా రక్షిత వివాహం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని బెంగుళూరు ప్యాలెస్‌లో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డితో రక్షిత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పలువురు. మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. (రక్షిత పెళ్లికూతురాయనే !) -
రక్షిత పెళ్లికూతురాయనే !
సాక్షి, బళ్లారి : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు ఇంట పెళ్లి సందడి మొదలైంది. శ్రీరాములు పెద్ద కుమార్తె రక్షిత వివాహం ఈ నెల 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో హైదరాబాద్‌కు చెందిన లలిత్ సంజీవ్‌రెడ్డితో జరగనుంది. సోమవారం బళ్లారి హవంబావిలో శ్రీరాములు స్వగృహంలో పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించి రక్షితను పెళ్లి కుమార్తెను చేశారు. శ్రీరాములు దంపతులు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు ప్యాలెస్‌లోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా కళా దర్శకులు వివాహ మంటపాన్ని తీర్చిదిద్దారు. (రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం) -
మెరుపులా వచ్చి మాయమవుతున్న సినీ స్టార్లు..
వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం. సాక్షి, బెంగళూరు: ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఊరించిన ఉపేంద్ర ఇక శాండల్‌వుడ్‌లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్స్టార్లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి. మండ్యలో వార్ ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్‌స్టార్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు. వీరితో పాటు చాలా మంది గతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెరపై మెరిసిన చాలా మంది రాజకీయాల్లో హిట్లు కొట్టలేకపోయారు. అంబరీశ్ రాజకీయాల్లో విజయం సాధించారు. అంబరీశ్ కేంద్రం,రాష్ట్రంలో మంత్రిగా పనిచేశా రు .అంతేకాకుండా పలుమార్లుఎన్నికల్లో గెలిచారు. ప్రముఖ నటి రక్షిత బీఎస్ఆర్ పార్టీలో చేరారు. తరువాత రాజకీయాల్లో కనిపించలేదు. పూజాగాంధీ జేడీఎస్ పార్టీలో చేరి కొద్దిరోజులు హల్చల్ చేశారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసినా తరువాత రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యారు. నటులు శ్రీనాథ్, జగ్గేశ్, చంద్రు, తారా, శ్రుతి, మాళవిక వంటివారు బీజేపీలో తగిన స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఉమాశ్రీ, జయమాల వంటి వారు ఇప్పటికీ విజయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. శాండల్‌వుడ్ సీనియర్ నటుడు అనంత్‌నాగ్ గతంలో జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జేహెచ్ పటేల్, రామక్రిష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా పేరుపొందారు. మండ్య మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా ట్విట్టర్లో కాక పుట్టిస్తుంటారు. చిత్రదుర్గ మాజీ ఎంపీ శశికుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పనిచేస్తూ కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ పాటిల్ మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. స్టార్ హీరోలు యశ్, దర్శన్ ఈ ఎన్నికల్లో సుమలత తరఫున మండ్యలో జేడీఎస్, కాంగ్రెస్‌లను ఢీకొంటున్నారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?
దాదాపు దశాబ్దంన్నర కిందట ‘ఇడియట్’ సినిమాతో తెలుగువారిని ఆకట్టుకున్న రక్షిత గుర్తుంది కదా. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంత మారిపోయింది. రక్షిత ఇటీవల తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెను గుర్తుపట్టిన పలువురు విస్మయపోయారు. ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఉండే రక్షిత ఇప్పుడు బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారింది. ఆమె తిరుమలలో కనిపించిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్‌గా మారిపోయింది. కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. దాదాపు 25 సినిమాల్లో నటించిన రక్షిత తెలుగులో ఇడియట్, ఆంధ్రావాలా, నిజం, శివమణి వంటి సినిమాల్లో నటించింది. -
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
-
డై..లాగి కొడితే...
సినిమా : ఇడియట్ రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్ చంటి (రవితేజ) కాలేజీలో చదువుతుంటాడు. ఫ్రెండ్‌తో కలిసి చంటి నడిచి వస్తుండగా కాలేజీలోని వీరి ఆపోజిట్ గ్యాంగ్ ముసుగు వేసి కొడతారు. లిఫ్ట్ అడిగి, సుచిత్ర (రక్షిత) కారులో గాయపడ్డ చంటిని ఆస్పత్రికి చేరుస్తాడు స్నేహితుడు. చంటికి రక్తం అవసరం కావడంతో ఇచ్చి వెళ్లిపోతుంది సుచిత్ర. పోలీస్ కమిషనర్ విప్రనారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురైన సుచిత్ర.. చంటి చదివే కళాశాలలో చేరుతుంది. ఆరోగ్యం ఇప్పుడెలా ఉందని సుచి పలుకరించగానే ‘ఐ లవ్ యూ’ అంటాడు చంటి. ‘నేం చెప్పింది ఏం చేశావ్’ అంటూ వెంటపడుతుంటాడు. మా ఫాదర్ ఎవరో తెలుసా? సుచిత్ర ప్రశ్నిస్తుంది. తెలుసు.. కమిషనర్ ఆఫ్ పోలీస్ అట కదా అంటాడు చంటి. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నాళ్లూ నీకు తెలియదనుకున్నా. తెలిసి కూడా.. అని ఆశ్చర్యపోతుంది సుచిత్ర. ‘కమిషనర్ కూతురని చెబితే భయపడిపోతామా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ల కూతుర్లకి మొగుళ్లు రారా?’ అని ప్రశిస్తాడు చంటి. ఈ డైలాగ్ మాస్ ప్రేక్షకులతో పాటు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. -
గ్రీన్ సిగ్నల్ మూవీ ప్లాటీనమ్
-
గ్రీన్ సిగ్నల్ న్యూ మూవీ స్టిల్స్
-
'సినిమాల్లో నటించను...ఎంపీగా పోటీ చేస్తా'
శ్రీకాళహస్తి : రానున్న ఎన్నికల్లో జేడీ (ఎస్) అభ్యర్థిగా బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని సినీనటి రక్షిత తెలిపారు. ఆమె గురువారం కుటుంబ సభ్యలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రక్షిత ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో రక్షిత విలేకర్లతో మాట్లాడుతూ వివాహానంతరం సినిమాల్లో నటించడం లేదన్నారు. అయితే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేస్తానని రక్షిత స్పష్టం చేశారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని ఆమె గత కొంతకాలంగా బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. కాగా మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో శాండిల్ ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు. అలాగే రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. -
మాండ్యలో శాండిల్ వార్
*అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం * పోటీలో రక్షిత, రమ్య, ఉపేంద్ర బెంగళూరు : మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ ఈమెకు స్వయాన బంధువు. అంతేకాకుండా రమ్యకు అటు అధిష్టాన ంతో పాటు ఇటు రాష్ట్ర నాయకులైన అంబరీష్‌తో సహా పలువురు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘యువ మంత్ర’ పఠిస్తుండటంతో మూడు పదులు కూడా దాటని రమ్యకు కలసివచ్చే అవకాశం. దీంతో రాబోయే మండ్యలో సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బరిలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక జేడీఎస్ తరఫున టికెట్టును శాండిల్‌వుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా పేరు సంపాదించుకున్న రక్షిత ప్రేమ్ ఆశిస్తున్నారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని నటి రక్షిత బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. రమ్య స్టార్‌డమ్‌ను అడ్డుకోవడానికి మరోస్టార్‌ను ఎన్నికల బరిలో దించాలనే ఫార్ములాను జేడీఎస్ నాయకులు అనుసరించాలనుకుంటే రక్షితకే పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది. శాండిల్‌వుడ్ రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీ కూడా మండ్య పార్లమెంటును ఎగురేసుకుపోవడానికి ‘స్టార్’ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు స్టార్లనే ఎన్నికల బరిలోకి దించితే వీరికి చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్రకు మండ్య పార్లమెంటు టికెట్టు కేటాయించే అవకాశం కన్పిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మండ్యపై దృష్టి పెట్టాయి.