కాలేజీలో చేరిన నాలుగో రోజే వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య | Polytechnic student commits suicide | Sakshi
Sakshi News home page

కాలేజీలో చేరిన నాలుగో రోజే వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Sun, Sep 1 2024 4:33 AM | Last Updated on Sun, Sep 1 2024 4:33 AM

Polytechnic student commits suicide

విద్యార్థి సంఘాల ఆందోళన

సీసీ ఫుటేజీల్లో లభ్యం కాని డేటా

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం అక్బర్‌నగర్‌ లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని లింగన్‌ వాడి రక్షిత (15) ఆత్మహత్యకు పాల్ప డటం కలకలం రేపింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌ గ్రామానికి చెందిన రక్షిత ఆగస్టు 27న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్టియర్‌లో చేరింది. శనివారం ఉదయం నిద్ర లేచిన ఆమె బాత్‌ రూమ్‌కు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో తోటి విద్యార్థులు తలుపులు గట్టిగా బాదడంతో కింది భాగం విరిగిపడింది. అందులో నుంచి చూసిన విద్యార్థినులకు రక్షిత చున్నీతో ఉరివేసుకున్న దృశ్యం కన్పించింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్‌ వార్డెన్, కేర్‌ టేకర్, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా వివరాలను సేకరించారు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీలో శుక్రవారం నాటి డాటా లేకపోవడంతో నిపుణులను పిలిపించి తీసుకుంటామని బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ రావు చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. 

కాగా, రక్షిత ఆత్మహత్య విషయమై కాలేజీ యాజమాన్యంపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి విష్ణు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమది వ్యవసాయ కుటుంబమని, నలుగురు సంతానంలో రక్షిత రెండో అమ్మాయని, రక్షితకు వ్యవసాయ విద్య అంటే ఎంతో ఇష్టమన్నారు.కాలేజీ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్, హాస్టల్‌ వార్డెన్‌ను విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
3

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement