
ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?
దాదాపు దశాబ్దంన్నర కిందట ‘ఇడియట్’ సినిమాతో తెలుగువారిని ఆకట్టుకున్న రక్షిత గుర్తుంది కదా. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంత మారిపోయింది. రక్షిత ఇటీవల తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెను గుర్తుపట్టిన పలువురు విస్మయపోయారు. ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఉండే రక్షిత ఇప్పుడు బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారింది.
ఆమె తిరుమలలో కనిపించిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్ వైరల్‌గా మారిపోయింది. కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. దాదాపు 25 సినిమాల్లో నటించిన రక్షిత తెలుగులో ఇడియట్, ఆంధ్రావాలా, నిజం, శివమణి వంటి సినిమాల్లో నటించింది.