
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని బెంగుళూరు ప్యాలెస్‌లో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డితో రక్షిత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పలువురు. మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. (రక్షిత పెళ్లికూతురాయనే !)
Comments
Please login to add a commentAdd a comment