
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిరోజులుగా జ్వరం రావడంతో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు వచ్చిననాటి నుంచి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని తెలిపారు. తనకు పరీక్షా సమయం ఎదురైందని, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటానని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కోలుకుని మరింత ప్రజాసేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే సీఎం యెడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్యలకు కోవిడ్ సోకి బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. (సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment