సాక్షి, బెంగుళూరు: ఉన్నతాధికారుల కక్ష సాధింపులకు నిరసనగా ఆటో నడుపుతున్న మాజీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీంద్రనాథ్‌కు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. ఆయన కొన్నిరోజులుగా దావణగెరెలో ఆటో నడుపుతూ నిరసన తెలియజేస్తున్న వైనం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు స్పందించి రవీంద్రనాథ్‌కు కొప్పళ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారిగా పోస్టింగ్ కేటాయించారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్లో తెలిపారు.
ಜಿಲ್ಲಾ ಆರ್ ಸಿಹೆಚ್ ಅಧಿಕಾರಿ ಡಾ. ಎಂ ಎಚ್ ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಬದುಕು ನಿರ್ವಹಣೆಗಾಗಿ ಆಟೋ ಓಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬ ಮಾಧ್ಯಮ ವರದಿಗಳು ಗಮನಕ್ಕೆ ಬಂದಕೂಡಲೇ ಈ ಬಗ್ಗೆ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳಿಂದ ವರದಿ ಕೇಳಿದ್ದೆ. 1/2 pic.twitter.com/Jdjr3Smy47
— B Sriramulu (@sriramulubjp) September 10, 2020
ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017–19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్‌సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించారు. దీనికి తాను నిరాకరించడంతో అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment