మైసూర్‌లో ఒక రహదారిపై చిరుత హల్‌చల్ చేసింది. పలువురిని భయబ్రాంతులకు గురిచేసేలా పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో చిరుత రోడ్డుపై వెళ్తున బైకర్‌ని కిందపడేసి, పిచ్చిపట్లినట్లు కలయ తిరిగింది.
ఆ చిరుతను నియంత్రించేందుకు వస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి దూరంగా పరుగులు పెట్టింది. చివరికి అటవీశాఖ అధికారులు ఆ చిరుతను ఏదోరకంగా శాంతింప చేసి లొంగదీసుకున్నారు. అది కాస్త ఒత్తిడికి గురైందని, అందువల్లే రోడ్డుపై ఉన్న జనాలను భయపెట్టించి పరుగులు పెట్టించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు చిరుత రక్షింపబడిందని ఆనందం వ్యక్తం చేయగా, కొంతమంది మానవులు ఆగడాలు ఎక్కువైపోవడం వల్లే అవి రోడ్లపైకి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు.
Disturbing visuals from Mysore.The crowd is only adding to the already stressed leopard.
— Susanta Nanda (@susantananda3) November 4, 2022
Latest, it has been safely tranquilised by the forest Department officials.
It’s only mistake was that it was seen. After which the people became wild & the real wild struggled for safety. pic.twitter.com/F4dXNsAYvT
Comments
Please login to add a commentAdd a comment