Ballari district
-
ష్.. కిచ్చా సుదీప్ ప్రచారానికి రెస్పాన్స్ ఇది!
Kichcha Sudeepa In Trending.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడనాట అందరివాడిగా పేరున్న సుదీప్.. గతంలోలాగే ఈ ఎన్నికల్లో కూడా తటస్థంగా ఉంటారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా.. రాజకీయాల్లో అడుగుపెట్టకుండానే కాషాయం పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో సుదీప్‌పై విమర్శలూ గుప్పించాయి. అయితే.. ఆ విమర్శల సంగతి పక్కనపెడితే మాస్ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ప్రచారంలోకి దిగితే.. అంతే భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఓవైపు అభిమానుల ఉత్సాహం, మరోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం.. ఫలితంగా సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా సుదీప్ చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. గురువారం విజయనగర జిల్లా కుడ్లిగి నియోజవర్గంలో సుదీప్ బీజేపీ అభ్యర్థి లోకేష్ వీ నాయక తరపున ప్రచారం నిర్వహించారు. ఆ రోడ్‌షోకి జనం సంద్రల్లా వెల్లువెత్తడం గమనార్హం. రోడ్డుకు ఇరువైపులా మోహరించిన ‘బాద్షా’ సుదీప్ ఫ్యాన్స్.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో సుదీప్ ప్రయాణిస్తున్న వాహనం ముందుకు కదల్లేదు . దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అంతకు ముందు బుధవారం సాయంత్రం బళ్లారి జిల్లా సండూర్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ప్రచారాన్ని అర్థాంతంగా ముగించారాయన. ఇది చూసి.. ఇది బీజేపీ ప్రచార ర్యాలీనా? లేక సుదీప్ అభిమానుల ర్యాలీనా? అనే డౌట్లను సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నారు పలువురు. ఓట్లు రాల్చడం మాటేమేగానీ.. సుదీప్ రాకను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ అభిమానులు షేర్ చేస్తున్న వీడియోలతో.. ఒక్కసారిగా కిచ్చా సుదీప్ #KichchaSudeepa హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ಅಭಿಮಾನಿಗಳ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ವೀರಮದಕರಿ ಚಿತ್ರದ ಡೈಲಾಗನ್ನು ಹೇಳಿದ ನಮ್ಮ ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಬಾಸ್...@KicchaSudeep #KicchaSudeep𓃵 #Kiccha46 #KicchaBOSS𓃵 #KarnatakaElection2023 pic.twitter.com/gku0Nw5njI — 𝐊𝐢𝐜𝐜𝐡𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞™ (@KicchaUniverse) April 27, 2023 ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಿ ಕೂಡ್ಲಿಗಿ ಯಲ್ಲಿ@KicchaSudeep #KicchaSudeep𓃵 #KicchaSudeep #Kiccha46 pic.twitter.com/Tzikcc7qX1 — ಕಿಚ್ಚನ ಆರ್ಮಿ ಬಳ್ಳಾರಿ (@KING_KICCHA_G) April 27, 2023 Kiccha Sudeep campaigns for BJP candidate. 🔥🔥 pic.twitter.com/fwDcsPIFXi — News Arena India (@NewsArenaIndia) April 26, 2023 Exclusive Video...🔥 Our Baadshah @KicchaSudeep Anna Road Show in #Kudligi 💥🚩😍#Kiccha46 #KicchaSudeep#KicchaBOSS𓃵 #KicchaSudeep𓃵 pic.twitter.com/IbH2dQDGcv — Abhinaya Chakravarthi Official Team Honnavara™ (@ACOTeamHonnavar) April 27, 2023 ఇదీ చదవండి: నేను బీజేపీకి న్యాయం చేయలేదు -
కర్ణాటకలో కమల దళానికి భారీ షాక్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి చేదు ఫలితాలు ఎదురుకాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విజయభేరి మోగించింది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్, బీజేపీ ఒక్క స్థానంలో ఉనికిని చాటుకున్నాయి. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బళ్లారి కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం ►బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ 14 స్థానాలు, ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. ►బీదర్ నగరసభలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 15 చోట్ల గెలిచింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ 1 స్థానంలో గెలిచింది. మరో రెండు స్థానాలకు ఎన్నిక జరగలేదు. ►రామనగర నగర సభలో మొత్తం 31 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, మరో స్థానంలో ఇతరులు గెలిచారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. ►రామనగర జిల్లా చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. మొత్తం 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బీజేపీ 7, మరో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలిచారు. ►హాసన్ జిల్లాలోని బేలూరు పురసభలో 23 సీటలో కాంగ్రెస్17, జేడీఎస్5, బీజేపీ1 నెగ్గాయి. ►సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో భద్రావతి నగరసభలో 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4, ఇతరులు రెండు చోట్ల గెలిచారు. ►శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణ పంచాయతీలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 సాధించాయి. ►చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీ 11 వార్డుల్లో కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు 3 స్థానాలనుగెలుచుకున్నారు. ►బెంగళూరు గ్రామీణం జిల్లా విజయపుర పురసభలో మొత్తం 23 వార్డులకు గానూ జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ►మడికెరె నగరసభ ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 23 స్థానాలకు గానూ బీజేపీ 16, ఎస్డీపీఐ 5, కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానంలో గెలుపు. -
స్టాక్ మార్కెట్ నష్టాలు.. కుటుంబం ఆత్మహత్య
సాక్షి, బళ్లారి రూరల్: అతనో చిరుద్యోగి. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనే అమ్మే అలవాటు వ్యసనంగా మారింది. నష్టాల పాలవుతున్నా ఏదో ఒకనాటికి లాభాలు రాకపోతాయా అనే ఆశతో ట్రేడింగ్ సుడిగుండంలో మునిగి నష్టాల్లో కూరుకుపోయాడు. ఫలితంగా ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పసికందుల్ని చంపి, భార్యతో కలిసి ఉరివేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన బళ్లారి జిల్లా గాదిగనూరలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గాదిగనూరుకు చెందిన నంజుండేశ్వర (32) జిందాల్లో పనిచేస్తుండేవాడు. ఇతడు షేర్లు కొనడం, అమ్మడం చేస్తుండేవాడు. అయితే కరోనా వైరస్ వల్ల షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురికావడంతో నంజుండేశ్వర పెద్దమొత్తంలో నష్టపోయాడు. సొంత డబ్బు పోగొట్టుకోవడంతో పాటు రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో బంధువులు కొంత సాయం చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున నంజుండేశ్వర పిల్లలు గౌతమి (3), స్వరూప్ (2)లకు పురుగుల మందు తాగించడంతో వారు మృత్యువాత పడ్డారు. తర్వాత భార్య పార్వతి(27), తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. డెత్‌నోట్ స్వాధీనం ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాలను విమ్స్‌కు తరలించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసిపెట్టిన డెత్‌నోట్ పక్కన ఉంది. కాగా మృతుని సోదరుడు గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ షేర్మార్కెట్లో నష్టాలే ఘోరానికి కారణమని తెలిపాడు. -
ఆటో డాక్టర్‌కు పోస్టింగ్
సాక్షి, బెంగుళూరు: ఉన్నతాధికారుల కక్ష సాధింపులకు నిరసనగా ఆటో నడుపుతున్న మాజీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీంద్రనాథ్‌కు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. ఆయన కొన్నిరోజులుగా దావణగెరెలో ఆటో నడుపుతూ నిరసన తెలియజేస్తున్న వైనం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు స్పందించి రవీంద్రనాథ్‌కు కొప్పళ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారిగా పోస్టింగ్ కేటాయించారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్లో తెలిపారు. ಜಿಲ್ಲಾ ಆರ್ ಸಿಹೆಚ್ ಅಧಿಕಾರಿ ಡಾ. ಎಂ ಎಚ್ ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಬದುಕು ನಿರ್ವಹಣೆಗಾಗಿ ಆಟೋ ಓಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬ ಮಾಧ್ಯಮ ವರದಿಗಳು ಗಮನಕ್ಕೆ ಬಂದಕೂಡಲೇ ಈ ಬಗ್ಗೆ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳಿಂದ ವರದಿ ಕೇಳಿದ್ದೆ. 1/2 pic.twitter.com/Jdjr3Smy47 — B Sriramulu (@sriramulubjp) September 10, 2020 ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017–19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించారు. దీనికి తాను నిరాకరించడంతో అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. చదవండి: ఉన్నతాధికారుల స్వార్థానికి బలయ్యా -
బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన
లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్‌పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఘనంగా రక్షిత వివాహం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని బెంగుళూరు ప్యాలెస్‌లో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డితో రక్షిత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పలువురు. మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. (రక్షిత పెళ్లికూతురాయనే !) -
పుచ్చకాయ పత్రిక తీసుకోండి.. పెళ్లికి రండి!
వెండి బంగారుతో నగిషీలు చెక్కి నవరత్నాలు పొదిగిన పెళ్లిపత్రికలను పంచే సంపన్నుల గురించి వార్తలొచ్చాయి. బంగారు నగలు, పట్టుచీరలు వంటి ఖరీదైన కానుకలతో కూడిన పెళ్లిపత్రికలను ఇచ్చినవారూ ఉన్నారు. పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి పంచడం చూస్తుంటాం. కానీ బళ్లారినగరవాసి పెళ్లి ఆహ్వానపత్రికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సాక్షి, బళ్లారి : నగరంలోని ఎస్పీ సర్కిల్ సమీపంలో సాయిగోపాల్, వాణికుమారిల కుమారుడు సాయి సందీప్ ఎస్జీ కాలేజీలో బాటనీ హెచ్ఓడీగా పని చేస్తున్నారు. ఈయన పెళ్లి అదే కాలేజీలో వృక్షశాస్త్రం లెక్చరర్‌గా పని చేస్తున్న తేజస్వినితో కుదిరింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను వినూత్న తరహాలో ముద్రించాలని భావించిన సాయి సందీప్ మండుటెండల్లో తీయగా ఉపశమనం కలిగించే పుచ్చకాయ మీద పెళ్లి పత్రికను ముద్రించి, బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. వెయ్యి పుచ్చకాయ పత్రికల పంపిణీకి ఏర్పాట్లు ఇప్పటివరకు 400 వరకు పుచ్చకాయలను పంపిణీ చేశానని, మొత్తం వెయ్యి మందికి ఆహ్వానం పలకనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయమే మార్కెట్లో 100కు పైగా పుచ్చకాయలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు అందజేస్తున్నామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కూడా తొలుత వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొంత మందికి పెళ్లి ఆహ్వానాలు పలికిన తర్వాత పుచ్చకాయలపై పెళ్లి ఆహ్వానం పలకడంతో సంతోషించారని, దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వృథా కాకూడదనే ఈ ప్రయత్నం సాయి సందీప్ సాక్షితో మాట్లాడుతూ మే 9న పెళ్లి సత్యనారాయణ పేటలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మంటపంలో పెళ్లి ముహూర్తమని తెలిపారు. ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేసి పంపిణీ చేసినా ఇలా చూసి అలా పడేస్తారని, దీంతో తాను అందించిన ఆహ్వాన పత్రిక వృథా కాకూడదని, గుర్తుండాలన్న సంకల్పంతో పాటు కళింగర కాయపై పెళ్లి వివరాలను రాసిన కాగితాన్ని అంటించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత చల్లని పుచ్చకాయను ఆరగించాలన్నదే తన ఉద్దేశమన్నారు. -
గాలికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
సాక్షి, బెంగళూర్ : మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అనేకల్ పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నాకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం. రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. మున్ముందు కూడా పార్టీ కోసం పని చేస్తా’’ అని గాలి జనార్దన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జనార్దన్ చెప్పారు. మైసూర్ చాముండీ ఆలయంలోకి సిద్ధరామయ్య షూ వేసుకుని వెళ్లిన ఘటన ఇంకా ప్రజలకు మరిచిపోలేదని జనార్దన్ తెలిపారు. తనపై 42 తప్పుడు కేసులు పెట్టి యూపీఏ ప్రభుత్వం తనను నాశనం చేయాలని చూసిందని.. కానీ, వారి కుట్రలు ఫలించలేదని ఆయన చెప్పారు. కాగా, గాలి జనార్దన్‌కు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్టీలో లేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాలికి హైకమాండ్ అనుమతి ఇవ్వాల్సిందేనని పరివర్తన యాత్ర సందర్భంగా యడ్యూరప్ప అన్నారు. అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015లో సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బళ్లారిలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గాలి జనార్దన్ రెడ్డి అక్కడి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ బెంగళూరులో నివాసం ఉన్నారు. ఫిరాయింపుల టెన్షన్... మధ్య కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఒకప్పుడు బీజేపీకి కంచుకోట. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకు గానూ 5 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మైనింగ్ కుంభకోణమే బీజేపీని ఇక్కడ దారుణంగా దెబ్బతీసింది.ఇప్పుడు మళ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరైన బీ నాగేంద్ర(కుద్లిగి నియోజకవర్గం) ఈ నెల 27న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆదివాసీ కమ్యూనిటీ నేత అయిన నాగేంద్ర, పార్టీ మారుతుండటం బీజేపీకి భారీ దెబ్బనే. మరోవైపు హోసాపేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పది రోజుల క్రితం యాడ్యూరప్ప నిర్వహించిన పరివర్తన యాత్రకు కూడా హాజరుకాకపోవటంతో ఆనంద్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీకి వలసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. వారు అంత ప్రభావంతమైన వ్యక్తులు కాకపోవటంతో వారి చేరికకు బీజేపీ విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలో జనాకర్షణ ఉన్న గాలి జనార్దన్‌ను పార్టీలోకి తీసుకోవటమే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందా ? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. -
5 రూపాయలకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్
బళ్లారి: చవక డేటా ప్యాకేజీల విషయంలో టెలికాం కంపెనీలు ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో అలాంటి ప్యాకేజీనే ప్రకటించి అదిరిపోయే లాభాలు ఆర్జిస్తున్నాడో యువకుడు. కేవలం ఐదు రూపాయలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోన్న అతను ఓ సాధారణ చాయ్‌వాలా! డేటాగిరీని కొత్త పుంతలు తొక్కిస్తోన్న ఈ యువకుఇ కథనంలోకి వెళితే.. కర్ణాటకలోని సిరుగుప్ప(బళ్లారి జిల్లాలోని గ్రామం) కు చెందిన 23 ఏళ్ల సయీద్ ఖాదర్ బాషా.. స్థానికంగా చిన్న టీస్టాల్ నడుపుకొంటున్నాడు. పదోతరగతి తర్వాత ఆర్థిక కారణాల వల్ల చదువుకు స్వస్తి చెప్పిన అతను.. చాయ్ వాలాగా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అందరిచేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తుండటం, స్నేహితులు ఇంటర్నెట్ వినియోగంపై చర్చించడం గమనించిన బాషా.. మెల్లగా నెట్ వ్యవహారాలపై పట్టుపెంచుకున్నాడు. స్థానిక కేబుల్ ఆపరేటర్ ద్వారా తన టీస్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు. టీస్టాల్ లో వైఫై రూటర్ ఏర్పాటుచేసి చాయ్ తాగే కస్టమర్లందరికీ 30 నిమిషాలపాటు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తున్నాడు. అయిదు రూపాయల టీ కొనుక్కున్న ప్రతిఒక్కరికీ వైఫై పాస్ వర్డ్ ఉంచిన కూపన్ ను ఇస్తాడు. అలా చాయ్ తాగుతూ డేటా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాడు. ఒకప్పుడు రోజుకు 100 టీలు అమ్మిన బాషా.. సెప్టెంబర్ లో 'ఫ్రీ ఇంటర్నెట్' ఐడియా అమలుచేస్తున్నప్పటి నుంచి 500 టీలు అమ్మేస్తున్నాడు. గతంలో ఉదయ్ పూర్, వడోదరాకు చెందిన ఇద్దరు చాయ్ వాలాలు కూడా ఇలాంటి ప్యాకేజీతోనే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 'నా టీస్టాల్ లో నెట్ స్పీడ్ 2ఎంబీపీఎస్. ఒకేసారి 10-15 మంది డేటా వాడుకుంటారు. సిరుగుప్ప లాంటి చిన్న పల్లెటూళ్లో ఇలాంటి సేవలు అద్భుతమని ఇక్కడికొచ్చే కస్టమర్లు కితాబిస్తారు. టీ అమ్మకాలు పెరగడం సంతోషంగా ఉన్నా, చదువుకునే విద్యార్థులకు ఎంతో కొంత సాయపడుతున్నానన్న సంతృప్తే నాకు ఆనందాన్నిస్తుంది' అని బాషా చెబుతున్నాడు. డేటా గిరీని కొనసాగించేలా బాషాను అభినందిద్దామా.. -
5 రూపాయలకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్
-
ఫేస్ బుక్‌లో ‘అను’ప్రకంపనలు
*చర్చనీయాంశమైన డీఎస్పీ అనుపమ ఫేస్బుక్ సారాంశం *గొప్ప మాటలు చెప్పే వారంతా పెద్ద వారు కాలేరు *చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటేనే మహానుభావులు అంటూ పోస్టు చేసిన అనుపమ *రాజీనామా ఆమోదిస్తారా... సర్దిచెబుతారా ? *నోరు మెదపని అధికారులు, రాజకీయ నాయకులు బళ్లారి : బళ్లారి జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామాపై స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు ఉన్నతా«ధికారులు సైతం నోరు మెదిపేందుకు జంకుతున్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించిన కూడ్లిగి డీఎస్పీ అనుమప షణై రాజీనామా ఉదంతంపై బళ్లారి జిల్లాలో పలువురు ఆందోళనలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుమప షణై రాజీనామా పత్రం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం చేరింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున షణైను పోలీసు ఉన్నతాధికారులు పిలిపించుకుని ఆమె రాజీనామాను ఎలాగైనా వెనక్కి తీసుకునేలా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. నిజాయితీ పరురాలైన కూడ్లిగి డీఎస్పీ శనివారం ఉన్నఫళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారి బళ్లారి జిల్లా అనుపమ వార్తల్లోకి ఎక్కారు. రెండు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అనుమప షణై నిజాయితీపై ప్రశంసలు జల్లు కురిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఉడిపికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏ నలుగురు కలిసినా అనుపమ షణై రాజీనామా ఎందుకు చేశారు? దాని వెనుక కారణాలు ఏమిటి? అనే చర్చ సాగుతోంది. కూడ్లిగిలో అంబేడ్కర్ కట్టడ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖ నేతలను అరెస్ట్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. ఈ నేపథ్యం ఆమె రాజీనామాకు కారణమైనప్పటికీ ఇంకా రాజీనామా వెనుక వేరే బలమైన కారణాలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేశారన్న దానిపై జిల్లాలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్లో మాట్లాడేందుకు కూడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆమె స్వయానా ఫేస్బుక్లో తన అభిప్రాయాలను వెల్లడించడంతో ఫేస్బుక్ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గొప్ప గొప్ప మాటలు చెప్పే వారంతా గొప్పవారు కాదు, చిన్న చిన్న మంచి మంచి విషయాలను అర్థం చేసుకునేవారు గొప్పవారవుతారు. ‘అన్యాయం చట్టమైనప్పుడు తిరుగుబాటు కర్తవ్యమవుతుంది’(వెన్ ఇన్జస్టిస్ బికమ్స్ లా, రెబలియన్ బికమ్స్ డ్యూటీ) అని అంగ్లంలో అనుపమ షణై ఫేస్బుక్లో పొందుపరిచారు. -
ఆయనవన్నీ అబద్దాలు...
*న్యూస్‌టుడే ఆఫీసు ఎక్కడుందో తెలియదన్న రామోజీరావు *ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదని వెల్లడి *న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు ఎవరో కూడా తెలియదన్న ఈనాడు చీఫ్ ఎడిటర్ రామోజీ * అదిచ్చే వార్తలను ఈనాడు ప్రచురిస్తుందని వివరణ * గాలి జనార్దనరెడ్డి వేసిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు * చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదంటూ సమాధానం.. తప్పించుకోవటానికే రామోజీ అబద్ధాలు చెబుతున్నారన్న ప్రతివాదులు విచారణ 22కు వాయిదా సిరుగుప్ప (బళ్లారి), న్యూస్‌లైన్: ‘ఈనాడు’ పత్రిక వార్తా సేకరణ విభాగమైన ‘న్యూస్‌టుడే ’ ఎక్కడుందో తనకు తెలియదన్నారు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు. దాని రిజిస్టర్డ్ ఆఫీసు హైదరాబాద్‌లోని తన ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదనే చెప్పారాయన. కోర్టు సాక్షిగా ఆయన ఇలా ప్రతిదానికీ తనకు తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇవ్వటంతో.. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు! ఔనా?’’ అని ప్రశ్నించారు ప్రతివాది తరఫు న్యాయవాది. ఇదంతా శనివారం కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ కోర్టులో జరిగింది. తనకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనాలపై గనుల యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి 2005లో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి ఆయన బెయిలు కోసం గతంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యారు కూడా. రెండోసారి నిందితుడిగా తన వివరణ ఇచ్చారు. మూడోసారి శనివారం క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పాటిల్ సిద్ధారెడ్డి, రవిచంద్ర ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరువునష్టం వార్తను ప్రస్తావించిన న్యాయవాదులు రామోజీని వేసిన ప్రశ్నలు, ఆయనిచ్చిన సమాధానాలు ఇలాఉన్నాయి.. లాయర్: ఈనాడు 23 ఎడిషన్లకీ మీరేనా చీఫ్ ఎడిటర్? రామోజీ: అవును నేనే. కానీ ఏ పేపర్లో ఏది పబ్లిష్ చేయాలన్నది వాళ్ల ఇష్టం. నేను చెప్పను. లా: ఈ పరువు నష్టం వార్త రాసిందెవరు? రా: నాకు తెలీదు. అయినా ఇది పరువు నష్టం వార్త కాదు. లా: ఇది పరువు నష్టం వార్త కాదన్నది మీ అభిప్రాయమా? నిర్ణయమా? రా: నా అభిప్రాయం మాత్రమే. లా: ఈ వార్తలు మీకు తెలియకుండానే పబ్లిష్ చేశారా? రా: మాకు న్యూస్‌టుడే అనే ఏజెన్సీ వార్తలు సప్లయ్ చేస్తుంది. వాటినే ప్రచురిస్తాం. అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. (వాస్తవానికి ఇది ఈనాడుకు చెందిన వార్తా సంస్థ) లా: అంటే న్యూస్‌టుడేతో మీకు ఎలాంటి సంబంధం లేదంటారా? రా: అవును. దాంతో మాకెలాంటి సంబంధం లేదు. లా: న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు మీకు తెలుసా? రా: తెలీదు. లా: ఆయన మీ ఉషోదయా హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ కదా! ఈనాడు బిల్డింగ్‌లోనే ఉంటారు కదా? రా: ఏమో! నాకు తెలీదు. లా: ఏడాది కిందట న్యూస్‌టుడే ఉద్యోగులందరినీ ఉషోదయ సంస్థలో విలీనం చేశారు. ఆ సంగతైనా తెలుసా? రా: ఏమో నాకు తెలీదు. ఒకసారి చూడాలి. లా: న్యూస్‌టుడే అడ్రస్ ఎక్కడ? రా: ఏమో! నాకు తెలీదు. లా: అది మీ ఈనాడు కాంపౌండ్లోనే ఉంది కదా! దాని రిజిస్టర్డ్ చిరునామా అదే కదా!! (ఆర్ఓసీ పేపర్లు చూపిస్తూ) రా: ఏమో.. నాకు తెలీదు. చూడాలి. లా: న్యూస్‌టుడే మరో డెరైక్టర్ బాపినీడు చౌదరి తెలుసా? రా: తెలుసు. ఎందుకంటే ఆయన ఈటీవీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. లా: న్యూస్‌టుడే కాకుండా వేరే తెలుగు ఏజెన్సీల నుంచి మీరు వార్తలు తీసుకుంటారా? రా: తీసుకోం. లా: మీపై హైకోర్టులో 200కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కదా? రా: ఏమో నాకు తెలీదు. లా: మీరు ఇదివరకు ఒక పరువు నష్టం కేసులో రూ.10 వేలు జరిమానా కూడా కట్టారు కదా? రా: ఏమో! నాకు గుర్తు లేదు. మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన రామోజీ... తాను 15 ఏళ్లుగా ఫిలిం సిటీలోనే ఉంటున్నానని, ఈనాడులో ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. తాను అన్ని వార్తలూ చూడనని, ఎడిటోరియల్, పాలసీ వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటానని అన్నారు.ష ఇలా రామోజీరావు అన్ని ప్రశ్నలకూ తెలీదనో, గుర్తులేదనో సమాధానాలు ఇస్తుండటంతో.. అవి దాటవేత జవాబులంటూ న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు. ఔనా?’’ అంటూ ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని రామోజీ జవాబిచ్చారు. దీంతో ఈ కేసును సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ (జేఎంఎఫ్‌సీ) న్యాయమూర్తి లక్ష్మీకాంత్ జానకీరావు మిస్కీ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.