బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన | 637 Kilometers On Foot; Labourers Ballarii To Bhadradri | Sakshi
Sakshi News home page

బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన

Mar 31 2020 4:33 AM | Updated on Mar 31 2020 7:52 AM

637 Kilometers On Foot; Labourers Ballarii To Bhadradri - Sakshi

బళ్లారి నుంచి కాలినడకన భద్రాద్రి జిల్లాకు చేరుకున్న వలస కూలీలు. (ఇన్‌సెట్‌)లో నడిరోడ్డుపైనే చంటి బిడ్డకు పాలు పడుతున్న మాతృమూర్తి

లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్‌పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం.
– దశరథ్‌ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement