సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి చేదు ఫలితాలు ఎదురుకాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విజయభేరి మోగించింది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్, బీజేపీ ఒక్క స్థానంలో ఉనికిని చాటుకున్నాయి. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది.
బళ్లారి కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
►బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ 14 స్థానాలు, ఇతరులు ఐదు చోట్ల గెలిచారు.
►బీదర్ నగరసభలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 15 చోట్ల గెలిచింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ 1 స్థానంలో గెలిచింది. మరో రెండు స్థానాలకు ఎన్నిక జరగలేదు.
►రామనగర నగర సభలో మొత్తం 31 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, మరో స్థానంలో ఇతరులు గెలిచారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేదు.
►రామనగర జిల్లా చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. మొత్తం 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బీజేపీ 7, మరో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలిచారు.
►హాసన్ జిల్లాలోని బేలూరు పురసభలో 23 సీటలో కాంగ్రెస్17, జేడీఎస్5, బీజేపీ1 నెగ్గాయి.
►సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో భద్రావతి నగరసభలో 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4, ఇతరులు రెండు చోట్ల గెలిచారు.
►శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణ పంచాయతీలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 సాధించాయి.
►చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీ 11 వార్డుల్లో కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు 3 స్థానాలనుగెలుచుకున్నారు.
►బెంగళూరు గ్రామీణం జిల్లా విజయపుర పురసభలో మొత్తం 23 వార్డులకు గానూ జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.
►మడికెరె నగరసభ ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 23 స్థానాలకు గానూ బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానంలో గెలుపు.
Comments
Please login to add a commentAdd a comment