Corporation Election Results
-
ఆ వలంటీర్.. ఇక కౌన్సిలర్!
దాచేపల్లి: ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు సర్పంచ్‌లుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే కోవలో ఇప్పుడు గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు వలంటీర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసిన దేవళ్ల లక్ష్మీప్రసన్న.. సమీప టీడీపీ అభ్యర్థి గోళ్ల నారాయణపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు 22 ఏళ్ల కౌన్సిలర్! వల్లూరు(కమలాపురం): వైఎస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డుకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్వీ నిఖిల్‌రెడ్డి విజయం సాధించారు. అతని వయసు 22 ఏళ్లు మాత్రమే. డిగ్రీ చదివిన నిఖిల్‌రెడ్డి 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. -
కుప్పకూలిన బాబు కోట
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలతో మొదలైన వైఎస్సార్సీపీ జైత్రయాత్ర తాజాగా జరిగిన రెండో దశ నగరపాలక(కార్పొరేషన్), పురపాలక (మున్సిపాల్టీ), నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్‌తో సహా 12 మున్సిపాల్టీ, నగరపాలక సంస్థలకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. సోమవారం పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల తరహాలోనే రెండో దశ నగర, పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకుగానూ(ఒకటి ఏకగీవ్రం) అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీకి కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 25 వార్డులకు కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 వార్డుల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. పెనుకొండ, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, గురజాల, కొండపల్లి, జగ్గయ్యపేట, ఆకివీడు పురపాలక, నగర పంచాయతీలను కూడా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలో మాత్రమే టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 7 వార్డుల్లో, టీడీపీ 13 వార్డుల్లో గెలుపొందాయి. 100 % ఒకే పార్టీకి ఇదే తొలిసారి.. తొలి విడత జరిగిన ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. ఇక తాజా ఫలితాలతో అధికార పార్టీకి దక్కిన పురపాలక సంస్థల సంఖ్య 74 నుంచి 84కు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వంద శాతం నగర పాలక సంస్థలను, 97.67 శాతం పురపాలక, నగర పంచాయతీలను ఒకే పార్టీ కైవశం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సురిపాలనతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధించి 175 శాసనసభ స్థానాలకుగానూ 151 చోట్ల, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 22 చోట్ల వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఫలాలను అందించడం ద్వారా పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీశారు. పరిపాలన సంస్కరణలను తెచ్చి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లారు. రెండున్నరేళ్లలో దాదాపు 15 నెలలు రెండు విడతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఛైర్మన్లు/ఛైర్పర్సన్లుగా 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశమిచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చూపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా.. అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకమైన పరిపాలన అందిస్తుండటంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులనే ప్రజలు ఆశీర్వదించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ప్రజలు తీర్చిదిద్దారని స్పష్టమవుతోంది. సాగనంపిన కుప్పం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. వార్డుకో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రులు, . బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తన కుమారుడు లోకేష్‌ను కుప్పం పంపి దౌర్జన్యాలకు దిగేలా శ్రేణులను ప్రేరేపించి భయోత్పాతం సృష్టించారు. డబ్బులు వెదజల్లారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. చివరకు తనదైన రీతిలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారు. ఆయన ఎన్ని చేసినా కుప్పం మున్సిపాల్టీ ప్రజలు ‘ఓటే’ అస్త్రంగా తిరుగులేని తీర్పు చెప్పారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 261 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 328 డివిజన్లు, వార్డులకు, 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు కలిపి మొత్తం 353 డివిజన్లు, వార్డు స్థానాల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికెషన్ విడుదల చేసింది. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైఎస్సార్సీపీ 261, టీడీపీ 82, జనసేన 5, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల గెలుపొందారు. -
మున్సిపల్ ఎన్నికలు: వైఎస్సార్సీపీ శ్రేణుల గెలుపు సంబరాలు
-
ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. చదవండి: CM YS Jagan: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారు? అని నిలదీశారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 54 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్లో క్లీన్‌స్వీప్
-
వైఎస్సార్సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్లో క్లీన్‌స్వీప్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని స్థానాల్లో గెలుపొంది ఎన్నికలను క్లీన్‌స్వీప్ చేసింది. నెల్లూరు కార్పొరేషన్లో ఫ్లాప్ షోతో.. సైకిల్ పార్టీ బొక్కబోర్లాపడింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. -
కర్ణాటకలో కమల దళానికి భారీ షాక్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి చేదు ఫలితాలు ఎదురుకాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విజయభేరి మోగించింది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్, బీజేపీ ఒక్క స్థానంలో ఉనికిని చాటుకున్నాయి. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బళ్లారి కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం ►బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ 14 స్థానాలు, ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. ►బీదర్ నగరసభలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 15 చోట్ల గెలిచింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ 1 స్థానంలో గెలిచింది. మరో రెండు స్థానాలకు ఎన్నిక జరగలేదు. ►రామనగర నగర సభలో మొత్తం 31 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, మరో స్థానంలో ఇతరులు గెలిచారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. ►రామనగర జిల్లా చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. మొత్తం 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బీజేపీ 7, మరో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలిచారు. ►హాసన్ జిల్లాలోని బేలూరు పురసభలో 23 సీటలో కాంగ్రెస్17, జేడీఎస్5, బీజేపీ1 నెగ్గాయి. ►సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో భద్రావతి నగరసభలో 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4, ఇతరులు రెండు చోట్ల గెలిచారు. ►శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణ పంచాయతీలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 సాధించాయి. ►చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీ 11 వార్డుల్లో కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు 3 స్థానాలనుగెలుచుకున్నారు. ►బెంగళూరు గ్రామీణం జిల్లా విజయపుర పురసభలో మొత్తం 23 వార్డులకు గానూ జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ►మడికెరె నగరసభ ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 23 స్థానాలకు గానూ బీజేపీ 16, ఎస్డీపీఐ 5, కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానంలో గెలుపు. -
తేలేది నేడే
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. అధికారులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. జిల్లాలో ఒక కార్పొరేషన్, ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ఉయ్యూరు, నందిగామ, తిరువూరులకు తొలి విడతగా పాలకవర్గాలు ఎన్నిక కానున్నాయి. పురపాలక సంఘాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకం పూర్తయింది. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. నాలుగేళ్లుగా వాయిదాలే... 2010 సెప్టెంబరులో పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. అప్పటి ప్రభుత్వం పురపాలక సంఘాల ఎన్నికలను వాయిదా వేసి ప్రత్యేకాధికారుల పాలనలోనే పురపాలక సంఘాలను నడిపింది. హైకోర్టు అక్షింతలు వేయడంతో దాదాపు 42 నెలల అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలను ఈ ఏడాది మార్చి 30న నిర్వహించారు. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పురపాలక సంఘాల కౌంటింగ్‌ను మే 12న నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 41 రోజుల తరువాత పురపాలక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లోని 218 వార్డులకు, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో మార్చి 30న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించగా సోమవారం కౌంటింగ్ జరగనుంది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 42 వార్డులకు చెందిన ఎన్నికల కౌంటింగ్ మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తారు. గుడివాడ పురపాలక సంఘంలోని 36 వార్డుల కౌంటింగ్‌ను గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో నిర్వహించనున్నారు. నూజివీడు పురపాలక సంఘంలోని 30 వార్డులకు, తిరువూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు, ఉయ్యూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నందిగామ పురపాలక సంఘంలోని 20 వార్డులకు, జగ్గయ్యపేట పురపాలక సంఘంలోని 27 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించనున్నారు. పెడన పురపాలక సంఘంలోని 23 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మచిలీపట్నంలోని శ్రీవరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.రఘునంద న్‌రావు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ... ఈ ఏడాది మార్చి 30న పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 41 రోజుల అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అభ్యర్థులు ఆశలు పెట్టుకోగా సాదారణ ఎన్నికల నేపధ్యంలో పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులూ నగదును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. కౌన్సిలర్ పదవి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండటంతో ఈ ఉత్కంఠకు తె రపడనుంది. ఇప్పటికే అభ్యర్థులు తమ తరఫున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి ప్రవేశించకుండా బారికేడ్లతో పాటు మెస్‌లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన లూ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయా పురపాలక సంఘాల ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. జోరుగా బెట్టింగ్‌లు... పురపాలక సంఘాల్లో కౌంటింగ్ సోమవారం జరగనుండటంతో ఆయా పురపాలక సంఘాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. ఏ పురపాలక సంఘంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు, వార్డుల వారీగా గెలిచే అభ్యర్థులకు ఎంత మెజారిటీ వస్తుంది తదితర అంశాల్లో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పందేల రాయుళ్లు అవతలి వ్యక్తులను రెచ్చగొట్టి మరీ పందేలకు పురిగొల్పుతున్నారు. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అతి తక్కువగా వెయ్యి రూపాయల నుంచి లక్షల్లో పందేలు జరుగుతున్నాయి.