
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు.
చదవండి: CM YS Jagan: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారు? అని నిలదీశారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 54 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment