
దాచేపల్లి: ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు సర్పంచ్‌లుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే కోవలో ఇప్పుడు గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు వలంటీర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసిన దేవళ్ల లక్ష్మీప్రసన్న.. సమీప టీడీపీ అభ్యర్థి గోళ్ల నారాయణపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
22 ఏళ్ల కౌన్సిలర్!
వల్లూరు(కమలాపురం): వైఎస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌వీ నిఖిల్‌రెడ్డి విజయం సాధించారు. అతని వయసు 22 ఏళ్లు మాత్రమే. డిగ్రీ చదివిన నిఖిల్‌రెడ్డి 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment