Karnataka Polls 2023: Kichcha Sudeep Trending Amid BJP Campaign, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Karnataka Assembly Polls 2023: ష్‌.. బీజేపీ తరపున కిచ్చా సుదీప్‌ ప్రచారానికి రెస్పాన్స్‌ ఇది!

Published Thu, Apr 27 2023 1:52 PM | Last Updated on Thu, Apr 27 2023 2:00 PM

Karnataka Polls 2023: Kichcha Sudeep Trending Amid BJP Campaign - Sakshi

Kichcha Sudeepa In Trending.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం.. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ బీజేపీకి మద్దతు ప్రకటించడం అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడనాట అందరివాడిగా పేరున్న సుదీప్‌.. గతంలోలాగే ఈ ఎన్నికల్లో కూడా తటస్థంగా ఉంటారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా.. రాజకీయాల్లో అడుగుపెట్టకుండానే కాషాయం పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో సుదీప్‌పై విమర్శలూ గుప్పించాయి. 

అయితే.. ఆ విమర్శల సంగతి పక్కనపెడితే మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న సుదీప్‌ ప్రచారంలోకి దిగితే.. అంతే భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఓవైపు అభిమానుల ఉత్సాహం,  మరోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం.. ఫలితంగా సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. 

ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా సుదీప్‌ చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. గురువారం విజయనగర జిల్లా కుడ్లిగి నియోజవర్గంలో సుదీప్‌ బీజేపీ అభ్యర్థి లోకేష్‌ వీ నాయక  తరపున ప్రచారం నిర్వహించారు. ఆ రోడ్‌షోకి జనం సంద్రల్లా వెల్లువెత్తడం గమనార్హం. 

రోడ్డుకు ఇరువైపులా మోహరించిన ‘బాద్‌షా’ సుదీప్‌ ఫ్యాన్స్‌.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో సుదీప్‌ ప్రయాణిస్తున్న వాహనం ముందుకు కదల్లేదు . దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. 

అంతకు ముందు బుధవారం సాయంత్రం బళ్లారి జిల్లా సండూర్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ప్రచారాన్ని అర్థాంతంగా ముగించారాయన. ఇది చూసి.. ఇది బీజేపీ ప్రచార ర్యాలీనా? లేక సుదీప్‌ అభిమానుల ర్యాలీనా? అనే డౌట్లను సోషల్‌ మీడియా వేదికగా కురిపిస్తున్నారు పలువురు. ఓట్లు రాల్చడం మాటేమేగానీ.. సుదీప్‌ రాకను పండుగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఆ అభిమానులు షేర్‌ చేస్తున్న వీడియోలతో.. ఒక్కసారిగా కిచ్చా సుదీప్‌ #KichchaSudeepa హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. 

ఇదీ చదవండి: నేను బీజేపీకి న్యాయం చేయలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement