
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 11 గంటలకు రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శర్వా పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక కోసం లీలా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు.
ఇరు కుటుంబ సభ్యులు ఒక రోజు ముందే ప్యాలెస్‌కు వెళ్లారు. శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకకు రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు. ఇక శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాస్త్రోక్తంగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేశాడు శర్వా. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకుంది ఈ జంట.
Comments
Please login to add a commentAdd a comment