అలనాటి అందాల హీరోయిన్ రక్షిత గుర్తుండే ఉంటుంది. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ రవితేజ, గిచ్చి గిచ్చి చంపుతోంది గ్రీకు సుందరి, చూపుతోటే వైరసేదో పంపుతున్నది అంటూ ఎన్టీఆర్.. వీళ్లిద్దరేనా! మహేశ్‌బాబు, నాగార్జున వంటి బడా హీరోలు కూడా ఆమెతో ఆడిపాడారు. తెలుగు, కన్నడ సినిమాలను సమంగా బ్యాలెన్స్ చేసిన రెండు చోట్లా ఓ వెలుగు వెలిగిన ఈ తార ప్రస్తుతం ఏం చేస్తుందో చదివయేండి..
రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగింది బెంగళూరులో. ఆమె తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆమె సినిమా ఎంట్రీ సులువైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో నత చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేసి 2002లో అప్పుతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమానే బంపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి.
అప్పుకు రీమేక్‌గా తెరకెక్కిన ఇడియట్(తెలుగు), దమ్(తమిళం) సినిమాల్లోనూ రక్షిత హీరోయిన్‌గా మెరిసింది. ఆమె నటనను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. కన్నడలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూనే తెలుగులోనూ నాగార్జునతో శివమణి, మహేశ్‌బాబుతో నిజం, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, జగపతిబాబుతో జగపతి సినిమాల్లో జోడీ కట్టింది. దీంతో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది.
అలా కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలో 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించిన ఆమె ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్‌ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు కన్నడ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఏక్ లవ్ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో గెస్ట్ పాత్ర ద్వారా కెమెరా ముందు నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment