sivamani cinema
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'ఇడియట్' హీరోయిన్!
అలనాటి అందాల హీరోయిన్ రక్షిత గుర్తుండే ఉంటుంది. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ రవితేజ, గిచ్చి గిచ్చి చంపుతోంది గ్రీకు సుందరి, చూపుతోటే వైరసేదో పంపుతున్నది అంటూ ఎన్టీఆర్.. వీళ్లిద్దరేనా! మహేశ్‌బాబు, నాగార్జున వంటి బడా హీరోలు కూడా ఆమెతో ఆడిపాడారు. తెలుగు, కన్నడ సినిమాలను సమంగా బ్యాలెన్స్ చేసిన రెండు చోట్లా ఓ వెలుగు వెలిగిన ఈ తార ప్రస్తుతం ఏం చేస్తుందో చదివయేండి.. రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగింది బెంగళూరులో. ఆమె తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆమె సినిమా ఎంట్రీ సులువైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో నత చదువుకు ఫుల్స్టాప్ పెట్టేసి 2002లో అప్పుతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమానే బంపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అప్పుకు రీమేక్‌గా తెరకెక్కిన ఇడియట్(తెలుగు), దమ్(తమిళం) సినిమాల్లోనూ రక్షిత హీరోయిన్గా మెరిసింది. ఆమె నటనను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. కన్నడలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతూనే తెలుగులోనూ నాగార్జునతో శివమణి, మహేశ్‌బాబుతో నిజం, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, జగపతిబాబుతో జగపతి సినిమాల్లో జోడీ కట్టింది. దీంతో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకుంది. అలా కెరీర్ ఓ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించిన ఆమె ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు కన్నడ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఏక్ లవ్ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో గెస్ట్ పాత్ర ద్వారా కెమెరా ముందు నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్: ఈ సినిమాలు చూశారా? తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష, చేతికి రింగు కూడా ఉందే! -
కరోనాపై ‘శివమణి’ డైలాగులు విన్నారా
-
కరోనాపై ‘శివమణి’ డైలాగులు విన్నారా
భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అధికారుల మాటలు లెక్క చేయకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. వివిధ సినిమా పోస్టర్ల ద్వారా అలాగే అనేక ఫన్నీ వీడియోలు రూపొందిస్తూ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. (అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్) ఈ క్రమంలో తాజాగా కింగ్ నాగార్జున ఆయన నటించిన శివమణి సినిమాలోని డైలాగులను కరోనా సంబంధిత మాటలుగా మార్చిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘నేను ఇప్పడు శివమణి సినిమా చేస్తే కరోనా సంక్షోభంలో పూరి జగన్నాథ్ రాసే డైలాగులు ఇలా ఉంటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో నాగార్జున మాటాలను భవిరి రవి కరోనా నేపథ్యంలో సాగే డైలాగులుగా వినిపించాడు. (‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్’) 2003లో వచ్చిన శివమణి సినిమాలో పోలీస్ పాత్రలో నాగ్ పూర్ణా మార్కెట్ ఇన్స్పెక్టర్గా వచ్చినప్పుడు స్థానిక రౌడీషీటర్లకు వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ మాటలను తొలగించి కరోనాకు మాస్కులు పెట్టుకోమంటే ఎందుకు వినిపించుకోవడం లేదని రౌడీలను హెచ్చరిస్తున్నట్లు భవిరి రవి ఎడిట్ చేశారు. ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది' అంటూ నాగార్జున రౌడీలకు ఇస్తున్న వార్నింగ్ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కరోనా గురించి నాగార్జున రౌడీలకు ఇచ్చిన వార్నింగ్ వీడియోను మీరు కూడా చూడండి. (పుష్ప: విజయ్ అవుట్.. బాబీ సింహా ఇన్ !) -
మీకు శివమణి సినిమా గుర్తుందా?
లండన్: మీకు శివమణి సినిమా గుర్తుందా? సముద్రపు ఒడ్డుకు సీసాలో దొరికిన ఓ సందేశం ఆధారంగా నడిచే కథ అది. సరిగ్గా ఇలాంటి ఘటనే జర్మనీలోని ఆమ్రమ్ ద్వీపం తీరంలో వెలుగుచూసింది. ఈ సీసాను 108 ఏళ్ల క్రితం బ్రిటీష్ శాస్త్రవేత్తలు సముద్రంలోకి విసిరేశారు. ఇప్పటివరకు లభించిన సీసా సందేశాల్లోకెల్లా ఇదే పురాతనమైనదని సీసాలో ఉన్న సందేశం ద్వారా తెలుస్తోంది. మెరియన్ వింక్లర్ అనే మహిళకు ఈ సీసా దొరికినపుడు దాన్ని తెరవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాన్ని పగులగొట్టగా అందులో ఓ సందేశం లభ్యమైంది. ఈ సీసా దొరికిన వారు తిరిగి అప్పజెప్పితే షిల్లింగ్ (పాత బ్రిటీష్ నాణెం) ఇస్తామని రాశారు. ఇది ఇంగ్లిష్, డచ్, జర్మన్ లిపిలో ఉంది. బ్రిటన్‌లోని ప్లిమౌత్కు చెందిన 'ద మెరైన్ బయలాజికల్ అసోసియేషన్' చిరునామా రాసి ఉంది. అసోసియేషన్ అధ్యక్షుడు జార్జ్ పార్కర్ బిడ్డర్ 1904 నుంచి 1906 మధ్యకాలంలో 1,020 సీసాలను ఇదే సందేశంతో సముద్రంలో విసిరేశారు. నీటి ఉపరితలంపై తేలుతూ ఉండేలా ప్రత్యేకంగా ఈ సీసాలను రూపొందించారు. సముద్ర అడుగు భాగాన నీటి ప్రవాహ ఉధృతిని అధ్యయనం చేసే ప్రాజెక్టులో భాగంగా వీటిని వదిలారు. సందేశంలో చెప్పినట్లుగా మెరియన్ వింక్లర్ దంపతులకు బహుమతిగా షిల్లింగ్ అందింది. కానీ, వారు 108 ఏళ్ల తరువాత దొరికిన సీసా కావడంతో దీన్ని గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 99 ఏళ్ల తరువాత లభించిన సీసా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు దాన్ని ఇది బద్దలు కొడుతుందని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.