టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్‌బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.
రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment